బిగ్‌ అప్‌డేట్‌: పవన్‌-క్రిష్‌ మూవీ టైటిల్‌ ఇదే!

పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు మరో శుభవార్త. నిన్నమొన్నటి వరకూ వరుస అప్డేట్లు ఇచ్చిన ‘వకీల్‌సాబ్‌’.. ఇప్పుడు తన 27వ చిత్రంతో అలరించేందుకు సిద్ధమయ్యారు. క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Published : 11 Mar 2021 17:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు మరో శుభవార్త. నిన్నమొన్నటి వరకూ వరుస అప్‌డేట్‌లు ఇచ్చిన ‘వకీల్‌సాబ్‌’.. ఇప్పుడు తన 27వ చిత్రంతో అలరించేందుకు సిద్ధమయ్యారు. క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఏ టైటిల్‌ ఖరారు చేస్తారా..? అని అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. మహాశివరాత్రి సందర్భంగా చిత్రబృందం టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ‘హరి హర వీరమల్లు’ అనే టైటిల్‌తో సినిమాలో పవన్‌కల్యాణ్‌ లుక్‌ను అభిమానులతో పంచుకుంది. టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను బట్టి చూస్తుంటే మునుపెన్నడూ కనిపించని విధంగా సరికొత్త పాత్రలో పవన్‌ కనిపించనున్నట్లు తెలుస్తోంది.

పీరియాడికల్‌ డ్రామాగా రానున్న ఈ చిత్రంలో పవన్‌ వజ్రాల దొంగగా కనిపించనున్నట్లు సమాచారం. పవన్‌ సరసన నిధి అగర్వాల్‌ సందడి చేయనుంది. చిత్రీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమాకు కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్‌ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు