OTT: అమెజాన్ ప్రైమ్‌లో అలరిస్తోన్న యాక్షన్ డ్రామా
‘పులి 19వ శతాబ్దం’ (Puli–19th Century) తాజాగా ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వేదికగా డిజిటల్ ప్రేక్షకులను అలరిస్తోంది.
హైదరాబాద్: మలయాళ చిత్రం 'పథోంపథం నూట్టండు' తెలుగులో ‘పులి 19వ శతాబ్దం’ (Puli –19th Century) పేరిట విడుదలైంది. యాక్షన్ ప్రియులను ఆకట్టుకున్న ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వేదికగా శనివారం రాత్రి నుంచి డిజిటల్ ప్రేక్షకులను అలరిస్తోంది. వినయన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మమ్ముట్టి అందించిన వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సిజు విల్సన్ (Siju Wilson) ఇందులో యోధుడుగా కనిపించారు. 19వ శతాబ్దంలో సాగే కథతో దీన్ని తెరకెక్కించారు. అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో జరిగే దొంగతనం, ఆ దొంగను ఎలా పట్టుకున్నారు అనే పాయింట్‌తో ఈ చిత్రం సాగుతుంది. ఈ క్రమంలో చూపించే విజువల్స్, స్టన్నింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లు డిజిటల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. నాటి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ చిత్రంలో చూపించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఇది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News: ఒడిశా రైలు విషాదం.. టాప్ టెన్ కథనాలు
-
India News
Odisha Train Tragedy: రైలు ప్రమాదం.. సాంకేతిక లోపమా..?మానవ తప్పిదమా?
-
General News
Odisha Train Accident : కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు.. ఏపీకి చెందిన వారి వివరాలివే..
-
India News
Odisha Train Tragedy: బోగీలు గాల్లోకి లేచి.. ఒకదానిపై మరొకటి దూసుకెళ్లి..!
-
India News
Odisha Train Tragedy: సరిగ్గా 14 ఏళ్ల క్రితం.. ఇదే శుక్రవారం..!
-
Crime News
Odisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన.. 278కి చేరిన మృతుల సంఖ్య