punarnavi bhupalam: అనారోగ్యంతో బాధపడుతున్న నటి పునర్నవి.. ఇదే చివరిది కావాలంటూ ఆకాంక్ష..

అనారోగ్యంతో బాధపడుతున్నట్లు నటి పునర్నవి భూపాలం (punarnavi bhupalam) తెలిపారు. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య ఉన్నట్లు తన ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు.

Updated : 03 Jan 2023 19:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొత్త ఏడాదిలో తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు నటి పునర్నవి భూపాలం (punarnavi bhupalam) తెలిపారు. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య ఉన్నట్లు తన ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. ‘ఊపిరితిత్తుల సమస్యతో కొత్త ఏడాదిని ప్రారంభిస్తున్నా. నేను అనారోగ్యం బారిన పడటం ఇదే చివరిది కావాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.

పునర్నవి పోస్టు చూసిన ఆమె అభిమానులు, నెటిజన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. 2013లో వచ్చిన ‘ఉయ్యాలా జంపాలా’ చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలిగా నటించారు. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసిన ఆమె ‘బిగ్‌బాస్‌’ రియాల్టీ షోతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. బిగ్‌బాస్‌ సీజన్‌-3 కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఆమె 77 రోజుల పాటు హౌస్‌లో ఉన్నారు. ఆ తర్వాత కూడా పలు సినిమా ఆఫర్లు ఆమెను వరించాయి. ‘ఎందుకో ఏమో’, ‘ఒక చిన్న విరామం’ తదితర చిత్రాల్లో నటించారు. ‘కమిట్‌మెంటల్‌’ అనే వెబ్‌సిరీస్‌లోనూ నటించారు. ప్రస్తుతం సినీ కెరీర్‌ను పక్కన పెట్టి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. తన డైలీ లైఫ్ గురించి ప్రతి అప్‌డేట్‌ను ఇన్‌స్టాలో పంచుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని