Published : 14 Apr 2022 01:20 IST

Puneeth Rajkumar: పునీత్‌ ఆఖరి చిత్రం.. ఓటీటీలోకి వచ్చేసింది

ఇంటర్నెట్ డెస్క్‌: కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ నటించిన ఆఖరి చిత్రం ‘జేమ్స్‌’. ఈ సినిమా ఆయన మరణానంతరం థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఓటీటీలో రిలీజ్‌ అయింది. ‘సోనీ లివ్‌’లో బుధవారం నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. చేతన్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రంలో శ్రీకాంత్‌, శివ రాజ్‌కుమార్‌, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌, ప్రియానంద్‌, శరత్‌కుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

కథేంటంటే: సంతోష్‌కుమార్ (పునీత్ రాజ్‌కుమార్‌) (Puneeth Rajkumar) ఓ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన బాడీగార్డ్‌. డ్ర‌గ్స్ మాఫియా నాయ‌కుల్లో ఒక‌రైన విజ‌య్ గైక్వాడ్ (శ్రీకాంత్‌)కి ర‌క్ష‌ణ‌గా విధుల్లో చేర‌తాడు. గైక్వాడ్‌ని, అత‌డి చెల్లెలు (ప్రియా ఆనంద్‌)ని ప‌లుమార్లు శ‌త్రువుల నుంచి కాపాడ‌తాడు. న‌మ్మ‌ద‌గిన వ్య‌క్తిగా పేరు తెచ్చుకుంటాడు. ఆ త‌ర్వాత అనూహ్యంగా విజ‌య్ గైక్వాడ్‌నే కిడ్నాప్ చేస్తాడు సంతోష్‌. త‌న‌ని తాను జేమ్స్‌గా ప‌రిచ‌యం చేసుకుంటాడు. ఇంత‌కీ ఈ జేమ్స్ ఎవ‌రు? గైక్వాడ్‌కి ర‌క్ష‌ణ‌గా వ‌చ్చి ఆయ‌న్నే కిడ్నాప్ చేయాల్సిన అవ‌స‌రం ఎందుకొచ్చింది? మాఫియాతో అత‌నికేమైనా సంబంధం ఉందా? అన్నది మిగతా కథ.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని