
Puneeth Rajkumar: పునీత్‌కు ఆ ఓటీటీ సంస్థ నివాళి.. ఉచితంగా ఆ ఐదుసినిమాలు చూడొచ్చు
బెంగళూరు: కన్నడ పవర్‌స్టార్ దివంగత పునీత్ రాజ్‌కుమార్‌కు ఘన నివాళి అర్పించింది ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో. ఈ సందర్భంగా ఆయన్ను గుర్తుచేసుకుంటూ ‘‘పునీత్ సినిమాలను, పీఆర్‌కె పొడక్షన్స్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడాన్ని మేం గౌరవంగా భావిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులకు.. పునీత్ విజన్‌ని.. ఆయన కథల్లో ది బెస్ట్‌ని అందిస్తాం’’ అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఆయన నటించి నిర్మించిన ఐదు సినిమాలు (యువరత్న, కవలుదారి, లా, మాయా బజార్, ఫ్రెంచ్ బిరియాని) చిత్రాలను ఫిబ్రవరి1 -28 వరకు స్ట్రీమింగ్ చేస్తున్నట్లు వెల్లడించింది. వీటిని అమెజాన్‌లో ఉచితంగా చూసే అవకాశం కల్పించింది. వాటితో పాటు పునీత్ నిర్మాణ సంస్థ రూపొందిస్తున్న 3 కొత్త సినిమాలు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, ‘వన్ కట్ టూ కట్’, ‘ఫ్యామిలీ ప్యాక్’ కూడా తమ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.