Published : 29 Jan 2022 02:01 IST

Puri Jagannadh: విజయ్‌ దేవరకొండతో పూరి ‘జనగణమన’?

హైదరాబాద్‌: దర్శకుడు పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు నటించిన ‘పోకిరి’, ‘బిజినెస్‌మేన్‌’ చిత్రాలు భారీ విజయాలు అందుకున్న విషయం తెలిసిందే. కొన్నేళ్ల కిందట వీరిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ చిత్రంగా ‘జనగణమన’ తెరకెక్కాల్సింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ పూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ కూడా విడుదలైంది. కానీ, కొన్ని కారణాల వల్ల మహేశ్‌బాబు ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత విక్టరీ వెంకటేశ్‌తో ఈ సినిమా చేయాలని పూరి భావించినా.. అదీ కార్యరూపం దాల్చలేదు. దీంతో ఆయన ఈ ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టి తన ఇతర సినిమాలపై ఫోకస్‌ పెట్టారు.

ఇప్పుడు మళ్లీ ‘జనగణమన’ ప్రాజెక్ట్‌ తెరపైకి వచ్చింది. యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండతో ఈ సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పూరి.. విజయ్‌ దేవరకొండతో ‘లైగర్‌’ చిత్రం తెరకెక్కిస్తున్నారు. కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. షూటింగ్‌ కూడా దాదాపు పూర్తయింది. మరోవైపు ‘జనగణమన’ స్క్రిప్టు సిద్ధంగా ఉండటంతో పూరి తనకు ఇష్టమైన ఈ ప్రాజెక్టును విజయ్‌తోనే తీయాలని నిర్ణయించుకున్నారట. ఇదే నిజమైతే వచ్చే నెలలోనే అమెరికాలో సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుందని సినీవర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని