Puri Jagannadh: మీది అలాంటి ప్రేమే అయితే దయచేసి ప్రేమించవద్దు: పూరి
Puri Musings: వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకొనే దర్శకుడు పూరి జగన్నాథ్ తాజాగా ‘డోంట్ ఓన్’పై మాట్లాడారు.
హైదరాబాద్: ప్రేమ పేరుతో ఒక వ్యక్తిపై అధికారం ప్రదర్శించే హక్కు ఎవరికీ లేదని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) అన్నారు. ఈ భూమ్మీదకు పర్యాటకులుగా వచ్చామని.. టూర్ పూర్తైన వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోతామని తెలిపారు. ‘పూరి మ్యూజింగ్స్’ వేదికగా ‘డోంట్ ఓన్’ అనే అంశంపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.
‘‘బుద్ధుడు సర్వసంగ పరిత్యాగి. ఏదీ నాదని అనుకోవద్దని చెప్పాడు. ఆయన చెప్పాడని అన్నీ వినలేం కదా. కనీసం మనకొక ఇల్లు, కారు, కనీస బ్యాంకు బ్యాలెన్స్ ఉండాలి. ఇవన్నీ ఓకే. దేనినైనా సొంతం చేసుకోండి.. కానీ మనిషిని కాదు. ఈ వ్యక్తి నా ఆస్తి అన్నట్లు ఎప్పుడూ ప్రవర్తించవద్దు. అలా అనుకోవడానికి మొదటి మెట్టు ప్రేమ. ప్రేమ పేరుతో ఒక వ్యక్తిని తాడేసి కట్టేస్తారు. దాంతో ఆ వ్యక్తికి ఊపిరాడదు. రాను రాను మీ ప్రేమ వాళ్లకు వేధింపుగా మారుతుంది. అవతలి మనిషి మనం చెప్పినట్టే వినాలి. రహస్యాలన్నీ మనతోనే పంచుకోవాలి అని భావిస్తుంటారు. మీది ఇలాంటి ప్రేమే అయితే దయచేసి ప్రేమించవద్దు. జీవితంలో ప్రేమనేది ఒక ఛాయిస్ లాంటిది. అంతేకానీ అవసరం కాదు’’
‘‘ప్రేమ లేకపోయినా సంతోషంగా బతకొచ్చు. నువ్వు ఎవరినీ ప్రేమించకపోతే కొన్ని సమస్యలు తగ్గినట్టే. నీ ప్రేమ అవతలి వ్యక్తికి ఊపిరాడకుండా చేస్తే ఎలా? ఒక వ్యక్తి మరొక వ్యక్తికి భారం కాకూడదు. అలా కాకూడదంటే వాళ్లిద్దరూ మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. భూమ్మీద ఉండే ప్రతి ఒక్కరూ కోరుకునేది గౌరవం, మర్యాద. ఎందుకంటే, అందులో స్వేచ్ఛ ఉంటుంది. పిల్లలకూ మనం గౌరవం ఇవ్వాలి. మీ భాగస్వామి.. తన స్నేహితులతో బయటకు వెళ్తానంటే వెళ్లనివ్వండి. మర్యాద ఇవ్వకపోతే రక్త సంబంధాలు కూడా ముక్కలైపోతాయి’’
‘‘మనందరం సాధారణ మనుషులం. ప్రతి ఒక్కరికీ ఒక జీవితం ఉంటుంది. ఒక మనిషి మరో మనిషిని సొంతం చేసుకోవడం తప్పు. ఓనింగ్లో మనం అధికారం చూపిస్తాం. వేరొకరి మీద మీ అధికారం ఏంటి? నీ పుట్టుక నీకు తెలియదు. నీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ముందుగా నీకు తెలియవు. అలాంటి నువ్వు పక్కవాడి పుస్తకం లాక్కొని వాడి కథలో కొన్ని సీన్స్ రాస్తా అంటే ఎలా? ఇక్కడ నీకు ఎన్ని ఆస్తులు ఉన్నా చివరికి వెళ్లేది ఒకే చోటకు. మనందరం ఇక్కడికి టూర్ కోసం వచ్చాం. టూరిస్ట్లా ఉందాం. చూద్దాం. ఎంజాయ్ చేద్దాం. టూర్ పూర్తి కాగానే వెళ్లిపోదాం. నీ తోటి పర్యాటకుడిని సొంతం చేసుకోవాలని మాత్రం చూడొద్దు’’ అని ఆయన వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. -
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రాల్లో ‘లెజెండ్’ ఒకటి. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలో బాలకృష్ణ సందడి చేశారు. -
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
తల్లి కానున్నట్లు వస్తోన్న రూమర్స్‌పై నటి పరిణీతి చోప్రా స్పందించారు. -
అక్షయ్‌తో బ్రేకప్.. ఆత్మహత్య వార్తలపై స్పందించిన రవీనా టాండన్
అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో వివాహం రద్దు కావడంపై నటి రవీనా టాండన్ (Raveena Tandon) స్పందించారు. బ్రేకప్ తర్వాత వచ్చిన పలు కథనాల గురించి ఆమె మాట్లాడారు. -
‘పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
‘పుష్ప3’ మూడో భాగానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. -
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. -
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్‌రాజు
రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్‌తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్‌తో కృతి సనన్
సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు. -
జాన్వీతో రామ్ చరణ్ సినిమా.. ఏడేళ్ల క్రితమే కోరిక బయటపెట్టిన చిరంజీవి
రామ్ చరణ్- జాన్వీ కపూర్ కలిసి సినిమా చేయాలని చిరంజీవి ఏడేళ్ల క్రితమే కోరుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. -
వరుస పరాజయాలతో నిద్రలేని రాత్రులు.. నేను కాబట్టి తట్టుకోగలిగా: స్టార్ హీరోయిన్
దాదాపు 25 ఏళ్ల సినీ కెరీర్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై బాలీవుడ్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) స్పందించారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విజయం అందుకోవడానికి అవి ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు. -
‘ఇదొక అద్భుతమైన చిత్రం.. ప్రేక్షకులు తప్పక సపోర్ట్ చేయాలి’ - కమల్ హాసన్
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన ‘ఆడు జీవితం’(Aadujeevitham)పై అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రశంసల వర్షం కురిపించారు. -
వివాహ బంధంలోకి సిద్ధార్థ్ - అదితి రావు
నటుడు సిద్ధార్థ్ (Siddharth) అదితిరావు హైదరీ (Aditi Rao Hydari)ని వివాహం చేసుకున్నారు. -
రామ్‌చరణ్ బర్త్‌డే.. భక్తులకు సురేఖ అన్నదానం
నటుడు రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు నేడు. ఈ వేడుకలను ఆయన తల్లి సురేఖ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సాక్షి వదిన తర్వాత.. ధోనీ భయ్యా ఎత్తుకుంది నన్నే: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ