Puri Musings: అంతా ఓకే.. చివర్లో ట్విస్ట్‌ అదిరింది

దేశంలో నానాటికి పెరుగుతున్న కరోనా వైరస్‌, దాని బారినపడిన కొంతమంది బాధితులు పడుతున్న ఇబ్బందులు చూసి.. మారుమూల గ్రామాలకో లేదా విదేశాలకే వెళ్లిపోవాలని ప్రతిఒక్కరూ అనుకుంటున్నారు.....

Published : 23 May 2021 13:43 IST

కోట్లు ఉంటే ఎక్కడికైనా వెళ్లొచ్చు కానీ..

హైదరాబాద్‌: దేశంలో నానాటికి పెరుగుతున్న కరోనా వైరస్‌, దాని బారినపడిన కొంతమంది బాధితులు పడుతున్న ఇబ్బందులు చూసి.. మారుమూల గ్రామాలకో లేదా విదేశాలకే వెళ్లిపోవాలని ప్రతిఒక్కరూ అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలా దేశాలు సైతం ద్వంద్వ పౌరసత్వాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాయి. అంటే ఒక మనిషి రెండు దేశాల్లో పౌరసత్వాన్ని పొందవచ్చు. ఈ విషయాన్ని తాజాగా పూరీ జగన్నాథ్‌ వివరించారు. అసలు ఇది ఏఏ దేశాల్లో అందుబాటులో ఉంది? దీన్ని పొందాలంటే ఏమి చేయాలి? అనే అంశాలను ఆయన తెలియజేశారు. అలాగే, భారతీయులకు చివర్లో ఓ ట్విస్ట్‌ కూడా ఇచ్చారు. ఇంతకీ ఆ ట్విస్ట్‌ ఏమిటో మీరే తెలుసుకోండి..!

‘కరోనా క్లిష్ట పరిస్థితుల తర్వాత చాలా దేశాలు ద్వంద్వ పౌరసత్వాన్ని ఆఫర్‌ చేస్తున్నాయి. అలా తీసుకుంటే మనం ఇక్కడైనా ఉండొచ్చు. అక్కడైనా ఉండొచ్చు. కరేబియన్‌ ద్వీపంలోని డొమినికా.. అక్కడ రియల్‌ ఎస్టేట్‌లో కనుక రూ.కోటి పెట్టుబడి పెడితే.. మీకు, మీ కుటుంబంలో ఉన్న వాళ్లందరికీ అక్కడ డ్యూయల్‌ సిటిజెన్‌షిప్‌ లభిస్తోంది. అంతేకాకుండా ఈ డొమినికా పాస్‌పోర్ట్‌ కనుక మీకు ఉంటే 130 దేశాలకు ఎలాంటి వీసా లేకుండా వెళ్లి రావొచ్చు. మాల్డొవా.. తూర్పు యూరప్‌లో ఉన్న ఎంతో అందమైన దేశమిది. ఆ దేశంలో రూ.90 లక్షలు పెట్టుబడి పెట్టినా, లేదా బ్యాంక్‌ డిపాజిట్‌ చేసినా సరే మూడు నెలల్లో 120 దేశాలకు ఫ్రీ వీసా ఇచ్చేస్తారు. టర్కీ.. ఇది ముస్లిం దేశమైనప్పటికీ.. ముస్లింలు కానీ వారికి కూడా సెకండ్‌ పాస్‌పోర్ట్‌ ఇస్తారు. కాకపోతే రూ.2 కోట్లు పెట్టుబడి పెట్టాలి. ఈ టర్కీ పాస్‌పోర్ట్‌ ఉంటే 112 దేశాలకు వెళ్లి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా డ్యూయల్‌ సిటిజెన్‌షిప్‌ ఇవ్వడానికి చాలా దేశాలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇండియా ఇలాంటి సిటిజెన్‌షిప్‌కి ఒప్పుకోదు. అదే ట్విస్ట్‌’ అని పూరీ వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని