Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్‌

సినీ పరిశ్రమలో స్నేహాలు, ప్రేమలు, లివింగ్‌ రిలేషన్‌షిప్‌, వ్యక్తిగత సంబంధాలపై అనేక వార్తలు, గుసగుసలు చక్కర్లు కొడుతూ

Updated : 16 Sep 2022 14:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సినీ పరిశ్రమలో స్నేహాలు, ప్రేమలు, లివింగ్‌ రిలేషన్‌షిప్‌, వ్యక్తిగత సంబంధాలపై అనేక వార్తలు, గుసగుసలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. స్టార్‌ దర్శకుడు పూరి జగన్నాథ్‌-ఛార్మి విషయంలోనూ ఇలాంటి వార్తలు సోషల్‌మీడియాలో కుప్పలు తెప్పలు. అయితే, ఎప్పుడూ వారిద్దరూ దీనిపై స్పందించలేదు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయమై పూరి తనదైన శైలిలో స్పందించారు.

విజయ్‌ దేవరకొండ (Vijay devarakonda) కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ మూవీ ‘లైగర్‌’ (Liger). అనన్య పాండే కథానాయిక. ఛార్మి (Charmme) నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ.. ‘‘ఆమె 50ఏళ్ల మహిళ అయితే, ప్రజలు ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోరు. ఆమె ఊబకాయంతో ఉన్నా.. ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నా, ఎవరికీ ఎలాంటి చింతా ఉండదు. కానీ, ఆమె (ఛార్మి) యంగ్‌ ఏజ్‌లో ఉంది కాబట్టి, ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని జనమంతా అనుకుంటున్నారు. ప్రతి జంటకూ ఓ రొమాంటిక్‌ యాంగిల్‌, శృంగార ఆకర్షణ ఉంటుందని నేను నమ్ముతా. అయితే, అది చాలా త్వరగా చచ్చిపోతుంది. మనందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ఆ వాంఛలనేవి కొన్ని రోజులకు పోతాయని అందరికీ తెలుసు. కేవలం స్నేహం మాత్రమే కలకాలం ఉంటుంది. ఈ అమ్మాయి(ఛార్మి) 13ఏళ్ల వయసు నుంచి నాకు తెలుసు. అంటే రెండు దశాబ్దాలుగా ఆమె గురించి తెలుసు. ఆమె ఎలా కష్టపడి పనిచేస్తుందో తెలుసు’’ అంటూ ఛార్మితో తనకున్న రిలేషన్‌ గురించి పూరి జగన్నాథ్‌ ఆసక్తికరంగా జవాబిచ్చారు.

ఇక ‘లైగర్‌’ గురించి మాట్లాడుతూ.. స్వతహాగా తాను రైటర్‌నని, పదేళ్ల కిందటే ‘లైగర్‌’కథ రాశానని చెప్పారు. ఈ ఆలోచన విజయ్‌కు చెప్పినప్పుడు తను చాలా ఉత్సాహం చూపించాడని అన్నారు. అతనికి రెండు కథలు చెబితే, ‘నాకు లైగర్‌ కథ నచ్చింది. నా శరీరాన్ని దృఢంగా చేసుకుంటా. ఫైటర్‌లా మారతా. ఈ సినిమా చేయండి’ అని అన్నాడని పూరి తెలిపారు. పూరి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ పతాకంపై ‘లైగర్‌’ నిర్మిస్తున్నారు. మైక్‌టైసన్‌, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం విజయ్‌ థాయ్‌లాండ్‌ వెళ్లి మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘లైగర్‌’ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని