Godfather: చిరు.. పూరి ఓ సినీ కల..!

అగ్ర కథానాయకుడు చిరంజీవితో కలిసి పని చేయాలన్నది దర్శకుడు పూరి జగన్నాథ్‌ కల. గతంలో చిరు కోసం ఆయన ఓ కథ సిద్ధం చేసినా.. కొన్ని కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు. ఎట్టకేలకు పూరికి చిరుతో

Updated : 10 Apr 2022 13:59 IST

గ్ర కథానాయకుడు చిరంజీవితో కలిసి పని చేయాలన్నది దర్శకుడు పూరి జగన్నాథ్‌ కల. గతంలో చిరు కోసం ఆయన ఓ కథ సిద్ధం చేసినా.. కొన్ని కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు. ఎట్టకేలకు పూరికి చిరుతో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. అదీ ఓ నటుడిగా. ప్రస్తుతం   చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గాడ్‌ఫాదర్‌’. ఆర్‌.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడిందులో పూరి జగన్నాథ్‌ ఓ ప్రత్యేక పాత్రలో మెరవనున్నారు.ఈ పాత్ర చిత్రీకరణ కోసం ఆయనశనివారం ‘గాడ్‌ ఫాదర్‌’ సెట్లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా చిరు ఆయనకి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘‘నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు, వెండితెరపైన నటుడిగా వెలుగు వెలగాని హైదరాబాద్‌ వచ్చాడు. ఒకటీ అరా వేషాలు వేశాడు. ఇంతలో కాలం చక్రం తిప్పింది. స్టార్‌ డైరెక్టర్‌ అయ్యాడు. అతడి మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా.. అందుకే ఇలా’’ అని ఆ ఫొటోలకు చిరు ట్వీట్‌ను జత చేశారు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: నీరవ్‌ షా.

‘ఆచార్య’ ట్రైలర్‌ ఆరోజే..

చిరంజీవి, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ తెరకెక్కించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్ని వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈనెల 12న ట్రైలర్‌ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా ఓ కొత్త పోస్టర్‌ను పంచుకుంది. ఈ సినిమాలో చిరు సరసన కాజల్‌ కనిపించనుండగా.. చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటించింది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు