Puri Musings: ఎమర్జెన్సీ ఫుడ్‌ గురించి తెలుసా

అనుకోని కారణాల వల్ల ఏదైనా విపత్తుల్లో చిక్కుకున్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి ఎమర్జెన్సీ ఫుడ్‌ అందుబాటులోకి వచ్చిందని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెలిపారు. ఒక ఎమర్జెన్సీ ఫుడ్‌ బకెట్‌ని..

Updated : 18 May 2021 15:06 IST

హైదరాబాద్‌: అనుకోని కారణాల వల్ల ఏదైనా విపత్తుల్లో చిక్కుకున్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి ఎమర్జెన్సీ ఫుడ్‌ అందుబాటులోకి వచ్చిందని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెలిపారు. ఒక ఎమర్జెన్సీ ఫుడ్‌ బకెట్‌ని 25 సంవత్సరాలపాటు నిల్వ ఉంచుకోవచ్చుని ఆయన అన్నారు. ‘పూరీ మ్యూజింగ్స్‌’ వేదికగా తాజాగా పూరీ ‘ఎమర్జెన్సీ ఫుడ్‌’ గురించి ఎన్నో విశేషాలు బయటపెట్టారు.

‘వరదలు రావొచ్చు.. యుద్ధాలు రావొచ్చు.. సునామీలో చిక్కుకుపోవచ్చు.. లేదా ప్రస్తుతం మనం చూస్తున్న ఇలాంటి విపత్తులాంటిది ఏదో ఒకటి వచ్చి లాక్‌డౌన్‌ పెట్టొచ్చు. ఏదో దరిద్రం జరిగి ఒక నెల పాటు కరెంట్‌ పోవచ్చు. క్యాంపింగ్‌కి వెళ్లినప్పుడు వాహనం పాడైపోయి అడవి మధ్యలో మీరు ఇరుక్కుపోవచ్చు. అలాంటి సమయంలో మనల్ని మనం సంరక్షించుకోవడం కోసం ఎమర్జెన్సీ ఫుడ్ సిద్ధం చేశారు’

‘ఒక డబ్బాలో ఫుడ్‌ ప్యాకెట్స్‌ సిద్ధంగా ఉంటాయి. కేవలం ఒక కప్పు వేడి నీళ్లు కలిపి ఆ ఆహారాన్ని తినేయవచ్చు. అంతకంటే వండాల్సిన అవసరం లేదు. బ్రేక్‌ఫాస్ట్‌, లంఛ్‌, డిన్నర్‌ చొప్పున ఒక నెలకు సరిపడా ఫుడ్‌ ప్యాకెట్స్‌తో బకెట్స్‌ అందుబాటులో ఉంటాయి. అలాగే రెండు రోజులకు సరిపడే ఫుడ్‌ ప్యాకెట్స్‌ కూడా దొరుకుతాయి. బార్లీ, కినోవా, ఓట్స్‌, న్యూడిల్స్‌, పాస్తా లాంటి ఫుడ్‌ ఐటమ్స్‌ కనుక.. ఒక బకెట్‌ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే పాతికేళ్లలోపు ఎప్పుడైనా వాడుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఎమర్జెన్సీ ఫుడ్‌లో సూప్స్‌, చికెన్‌ నూడిల్స్‌, పాస్తా... ఇలా ఏది కావాలంటే అది మీరు కొనుగోలు చేసుకోవచ్చు’ అని పూరీ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని