Puri Musings: వైబ్స్‌ బాగోకపోతే కుక్కలు కూడా కరుస్తాయ్‌

ఒక మనిషి నెగటివ్‌ మైండ్‌ పెట్టుకుని పాజిటివ్‌ లైఫ్‌ కావాలంటే అది ఎప్పటికీ జరగదని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెలిపారు.....

Published : 10 Jun 2021 12:46 IST

హైదరాబాద్‌: ఒక మనిషి నెగిటివ్‌ మైండ్‌ పెట్టుకుని పాజిటివ్‌ లైఫ్‌ కావాలంటే కుదరదని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెలిపారు. తాజాగా ఆయన ‘పూరీ మ్యూజింగ్స్‌’ వేదికగా ‘వైబ్‌’ అనే కాన్సెప్ట్‌ గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. సాయిబాబాకు ఉన్నట్లు మనకు కూడా ‘ఆరా’ ఉంటుందని (Aura) ఆయన తెలిపారు. దానిని చూడాలనుకుంటే ఎన్నో యాప్‌ మనకు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. ఇంతకీ వైబ్స్‌ గురించి ఆయన ఏమన్నారంటే..

‘ఒక మనిషిని చూడగానే ఏదో తెలియని సంతోషం.. పాజిటివ్‌ ఫీలింగ్‌ కలుగుతుంది. అదే వేరొక మనిషిని చూడగానే వీడు ఎందుకు వచ్చాడు అనిపిస్తుంది. అలాంటి ఫీలింగ్స్‌నే వైబ్స్‌ అని అంటారు. గుడ్‌ వైబ్స్‌, బ్యాడ్‌ వైబ్స్‌ ఉంటాయి. ప్రతి మనిషి నుంచి ఒక వైబ్రేషన్‌ వస్తుంది. ఒక ఎనర్జీ రిలీజ్‌ అవుతుంది. మన నుంచి వచ్చే ఎనర్జీ ఎప్పుడూ పాజిటివ్‌గానే ఉండాలి. అలా ఉంటేనే మంచిది. ఎందుకంటే మన వైబ్స్‌ మన జీవితాన్నే మార్చేస్తాయి’

‘సాయిబాబా ఫొటోలు చూసినట్లు అయితే ఆయన వెనుక ఒక వెలుతురు కనిపిస్తుంది. దాన్నే ఆరా (Aura) అంటారు. అది మనకు కూడా ఉంటుంది. దాన్ని ఫొటో తీయడానికి ఒక స్పెషల్‌ కెమెరా కూడా ఉంది. మన చుట్టూ ఉన్న ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌ ఎనర్జీని అది క్లిక్‌ చేస్తుంది. దాన్నే క్రిలియన్‌ ఫొటోగ్రఫీ అంటారు. AURLA అనే యాప్‌ ఉంది.. దాంతో మీరు సెల్ఫీ తీసుకుంటే మీ స్టేట్‌ ఆఫ్‌ మైండ్‌ ఎలా ఉందో అది చెబుతుంది. అయితే, ఈ యాప్స్‌ ఎంతవరకూ నిజమో చెప్పలేం. కానీ, మన చుట్టూ తప్పకుండా ఎవ్వరికీ కనిపించని ఒక గ్లో ఉంటుంది. దాన్నే వైబ్‌ అంటారు. నెగిటివ్‌ మైండ్‌ పెట్టుకుని పాజిటివ్‌ లైఫ్‌ కావాలంటే కుదరదు. మనమే కాదు, మన ఇంట్లో కూడా పాజిటివ్‌ వైబ్స్‌ ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ మన వైబ్స్‌ బాగోకపోతే కుక్కలు కూడా కరుస్తాయ్‌’ అని ఆయన వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని