Puri Musings: కన్ఫ్యూజన్‌ లేకుండా గమ్యం చేరుకోండి

మనం ఎక్కడికైనా తెలియని ప్రాంతానికి, లేదా ప్రదేశానికి అంత దాకా ఎందుకు మొదటిసారి స్నేహితుడు ఇంటికి వెళ్లాలన్నా సరే.. లొకేషన్‌ ఆధారంగా గూగుల్‌ మ్యాప్స్‌ సాయం తీసుకుంటాం. మ్యాప్స్‌ ఆధారంగా గమ్యస్థానానికి త్వరగా...

Published : 09 Jun 2021 19:30 IST

‘వాట్‌ 3 వర్డ్స్’ యాప్‌ గురించి తెలుసా..?

హైదరాబాద్‌: మనం ఎక్కడికైనా తెలియని ప్రాంతానికి లేదా మొదటిసారి స్నేహితుడి ఇంటికి వెళ్లాలన్నా సరే.. లొకేషన్‌ ఆధారంగా గూగుల్‌ మ్యాప్స్‌ సాయం తీసుకుంటాం. మ్యాప్స్‌ ఆధారంగా గమ్యస్థానానికి త్వరగా చేరుకుంటాం. అయితే, కొన్నిసార్లు మ్యాప్స్‌ ఉపయోగించినప్పటికీ కన్ఫ్యూజన్‌తో దారి తప్పుతాం. ఇలాంటి ఎన్నో ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉండే విధంగా రూపొందించిన యాప్‌.. ‘వాట్‌ 3 వర్డ్స్‌’ అని అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌.

తాజాగా ఆయన ‘వాట్‌ 3 వర్డ్స్‌’ యాప్‌ గురించి ‘పూరీ మ్యూజింగ్స్‌’ వేదికగా తెలియజేశారు. ఈ యాప్‌ సాయంతో చిట్టడవుల్లో చిక్కుకున్నా సరే సురక్షితంగా బయటకు చేరుకోవచ్చని ఆయన చెప్పారు. యాప్‌ వినియోగం గురించి తెలియజేశారు. ప్రస్తుతానికి ఈ యాప్‌ 26 భాషల్లో అందుబాటులో ఉందని.. అతి త్వరలో తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ భాషల్లో కూడా రానుందని ఆయన వివరించారు. అంతేకాకుండా ఈ యాప్‌ను ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పూరీ సూచించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని