Puri Musings: అనవసర ఆహారమే జబ్బులకు కారణం

ఉన్నది ఒక్కటే జీవితం.. ఒక్కసారే బతుకుతాం.. కాబట్టి ఒక్క మెతుక్కూడా వదలొద్దు’ అని అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌. విభిన్నమైన అంశాలతో తరచూ నెటిజన్లను మెప్పిస్తున్న ఆయన తాజాగా....

Updated : 13 Jun 2021 13:40 IST

ఒక్క మెతుక్కూడా వదలొద్దు అంటోన్న పూరీ

హైదరాబాద్‌: ‘ఉన్నది ఒక్కటే జీవితం.. ఒక్కసారే బతుకుతాం.. కాబట్టి ఒక్క మెతుక్కూడా వదలొద్దు’ అని అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌. ఆయన తాజాగా ‘పూరీ మ్యూజింగ్స్‌’ వేదికగా ‘లిక్‌ ది బౌల్‌’ గురించి వివరించారు. మనకు అవసరమైనంత మాత్రమే భోజనాన్ని తీసుకోవాలని.. దానికంటే ఎక్కువగా తినకూడదని అన్నారు. అంతేకాకుండా బుద్ధిజాన్ని ఫాలో అయ్యే వాళ్లు రోజులో ఎక్కువ గంటలు ఉపవాసం ఉంటారని.. ప్రతి ఒక్కరూ అలాంటి ఉపవాసం చేస్తే ఎంతో బాగుంటుందని వివరించారు.

‘‘బుద్ధిజాన్ని ఆచరించే వాళ్లను బుద్ధిస్టులు అంటారు. వాళ్ల చేతుల్లో ఒక పాత్ర ఉంటుంది. దాన్నే బిక్షాటన పాత్ర అంటారు. అందులో కేవలం ఒకసారి ఒక మనిషికి సరిపోయే ఆహారం మాత్రమే పడుతుంది. ఈ కాన్సెప్ట్‌ని కనిపెట్టింది బుద్ధుడు. బుద్ధిజం ఫాలో అయ్యే వాళ్లు రోజులో ఒక్కటి లేదా రెండు సార్లు మాత్రమే ఆహారం తీసుకుంటారు. మిగతా సమయం అంతా ఉపవాసం ఉంటారు. సుమారు 18 గంటలపాటు వాళ్లు ఉపవాసం చేస్తారు. ఇలాంటి ఉపవాసాలు మనం కూడా చేస్తే ఎంతో బాగుంటుంది’’

‘‘ప్లేట్‌లో ఆహారం పెట్టుకుని తినే బదులు గిన్నె పెట్టుకుని తినాలి. అలా చేయడం వల్ల ఫుడ్‌ కంట్రోల్డ్‌గా తినగలుగుతాం. మనకు వచ్చే జబ్బులకు కారణం అధికంగా తీసుకునే ఆహారం. మీరు తిండి తగ్గించాలంటే ఓరియాకీ సెట్‌(బుద్ధిజం ఫాలో అయ్యేవాళ్లు వాడే గిన్నెలు) వాడండి. తక్కువ తింటే నీరసం వస్తుందని అనుకోకండి బలంగానే ఉంటారు’ అని పూరీ వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు