Puri Jagannadh: విజయ్‌.. నీ గుండెల్లోని మంటను చూశా: పూరీ

ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే నటుడిగా తనకంటూ స్పెషల్‌ ఇమేజ్‌ని సృష్టించుకున్నారు విజయ్‌ దేవరకొండ....

Updated : 09 May 2022 11:51 IST

హైదరాబాద్‌: ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే నటుడిగా తనకంటూ స్పెషల్‌ ఇమేజ్‌ని సృష్టించుకున్నారు విజయ్‌ దేవరకొండ. జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్‌లో వరుస సినిమాలు చేస్తోన్న ఆయన్ని దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ప్రశంసించారు. సోమవారం విజయ్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని పూరీ ఓ పోస్ట్‌ పెట్టారు.

‘‘విజయ్‌.. నీ గుండెల్లోని మంటను నేను చూశా..! నీలో దాగున్న మంచి నటుడ్ని నేను చూశా..! నీ మనసు ఏం ఆలోచిస్తుందో నాకు తెలుసు..! నటుడిగా ఏదో సాధించాలనే నీ ఆకలి, పని పట్ల నీకున్న అమితమైన ఇష్టం, కమిట్‌మెంట్‌, నీ దయా హృదయం.. ఇవన్నీ నువ్వు మరింత విజయం సాధించేలా చేస్తాయి. ఏదో ఒకరోజు నువ్వు తప్పకుండా దేశం గర్వపడే వ్యక్తివి అవుతావు. ప్రస్తుతానికి నిన్ను విజయ్‌ దేవరకొండ అని పిలుస్తా’’ అని పూరీ రాసుకొచ్చారు. పూరీ-విజయ్‌ కాంబినేషన్‌లో ‘లైగర్‌’ విడుదలకు సిద్ధం కాగా, వీరిద్దరి కాంబోలో ‘జనగణమన’ పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. ఇక, విజయ్‌ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ ప్రేమ కథా చిత్రం సిద్ధమవుతోంది. సమంత కథానాయిక. తాజాగా ఈ సెట్‌లో విజయ్‌ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఆ ఫొటోలను సామ్‌ షేర్‌ చేస్తూ.. విజయ్‌ మంచి నటుడని.. వర్క్‌ పట్ల అతను చూపించే ఆసక్తి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ ఏడాది విజయ్‌కి అంతా మంచే జరగాలని ఆమె కోరుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని