Pushpa 2: ‘ఆర్ఆర్ఆర్‌’, ‘కేజీయఫ్‌2’ హిట్‌.. ‘పుష్ప2’పై ఒత్తిడి?

అల్లు అర్జున్‌(Allu arjun) కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప’(Pushpa).

Updated : 07 Dec 2022 21:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అల్లు అర్జున్‌(Allu arjun) కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప’(Pushpa). గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇతర భాషల్లోనూ ‘పుష్ప’ సత్తా చాటాడు. ఆ తర్వాత దక్షిణాది నుంచి భారీ బడ్జెట్‌ చిత్రాలైన ‘ఆర్‌ఆర్ఆర్‌’, ‘కేజీయఫ్‌2’ కూడా సక్సెస్‌ అందుకున్నాయి. ఈ క్రమంలో ‘పుష్ప: ది రూల్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ‘పుష్ప2’ను మరింత అలరించేలా తీర్చిదిద్దే పనిలో పడ్డారట దర్శకుడు సుకుమార్‌. తొలి భాగాన్ని మించేలా సన్నివేశాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తొలుత అనుకున్న కథకు కాస్త అదనపు హంగులు అద్దడంతో పాటు, హీరో ఎలివేషన్స్‌ సీన్స్‌ సరికొత్తగా డిజైన్‌ చేసుకుంటున్నారని టాక్‌. అందుకే ఈ సినిమా గురించి ప్రస్తుతం ఎలాంటి టాక్‌ వినిపించటం లేదు. ఒకసారి పూర్తి స్క్రిప్ట్ సిద్ధం అయిపోయిన తర్వాత సెట్స్‌పైకి వెళ్లాలని చిత్ర బృందం యోచిస్తోంది. మరోవైపు బన్ని అభిమానులు మాత్రం ‘పుష్ప2’ గురించి అప్‌డేట్‌లు ఎప్పుడు వస్తాయా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని