Pushpa 2: డిసెంబరు 6న పుష్ప 2

కొన్ని రోజులుగా ప్రచారం సాగుతున్నట్టుగానే ‘పుష్ప2’ వాయిదా పడింది. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రావల్సిన ఈ సినిమాని డిసెంబరు 6న విడుదల చేస్తున్నట్టు సినీ వర్గాలు సోమవారం రాత్రి ప్రకటించాయి.

Updated : 18 Jun 2024 03:53 IST

కొన్ని రోజులుగా ప్రచారం సాగుతున్నట్టుగానే ‘పుష్ప2’ వాయిదా పడింది. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రావల్సిన ఈ సినిమాని డిసెంబరు 6న విడుదల చేస్తున్నట్టు సినీ వర్గాలు సోమవారం రాత్రి ప్రకటించాయి. ‘పుష్ప2’ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. పతాక సన్నివేశాలతోపాటు, పాటలు తెరకెక్కించాల్సి ఉంది. వీటికి సమయం పట్టే సూచనలు కనిపించడంతో సినిమాని వాయిదా వేయాలని చిత్రబృందం నిర్ణయించింది. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ‘పుష్ప: ది రైజ్‌’కి కొనసాగింపుగా తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక నటిస్తోంది. ఫహాద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. తొలి చిత్రం ‘పుష్ప: ది రైజ్‌’ కూడా డిసెంబరులోనే విడుదలైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని