Allu Arjun: బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. టీజర్‌తో సర్‌ప్రైజ్‌ సిద్ధం చేస్తోన్న ‘పుష్ప2’టీం

‘పుష్ప2’ (Pushpa 2)కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరలవుతోంది. అల్లు అర్జున్‌ పుట్టిన రోజు నాడు ఈ సినిమా టీజర్‌ విడుదల చెయ్యనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Published : 21 Mar 2023 15:56 IST

హైదరాబాద్‌: సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తోన్న సినిమా ‘పుష్ప2’ (Pushpa 2). ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి అభిమానులు దీని అప్‌డేట్స్‌ ఎప్పుడిస్తారా అని ఆశగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించి మేజర్‌ అప్‌డేట్‌ ఏదీ విడుదల చెయ్యలేదు. దీంతో అల్లు అర్జున్‌ (Allu Arjun) పుట్టిన రోజు నాడు కచ్చితంగా  అప్‌డేట్‌ ఇస్తారనుకున్నారు ఫ్యాన్స్‌. అలాంటి వారి ఆశలు చిగురించేలా ఓ వార్త బయటకు వచ్చింది. 

అల్లు అర్జున్‌ పుట్టిన రోజు నాడు ‘పుష్ప2’ టీజర్‌ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ 8న ఏకంగా 3 నిమిషాల టీజర్‌ను రిలీజ్‌ చెయ్యనున్నారుట. ఆ వీడియోలో పూర్తి యాక్షన్‌ సన్నివేశాలు ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.  ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టర్‌ ఒకటి నెట్టింట సందడి చేస్తోంది. ఇక ఇప్పటికే ‘పుష్ప2’ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోన్న విషయం తెలిసిందే.  వైజాగ్‌, హైదరాబాద్‌ల్లో  సినిమాకు సంబంధించి పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.  ‘పుష్ప’ (Pushpa) సినిమా విడుదలై ఎంత బ్లాక్‌బాస్టర్‌ విజయాన్ని సాధించిందో తెలిసిన విషయమే. ఈ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతోన్న ‘పుష్ప2’పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ చిత్ర దర్శకుడు సుకుమార్‌ (Sukumar) కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘పుష్ప2’లో డైలాగులు కూడా ట్రెండ్‌ సృష్టిస్తాయని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని