Pushpa 2: ‘పుష్ప 2’ వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన టీమ్

పాన్‌ ఇండియా మూవీ ‘పుష్ప 2’ విడుదల వాయిదా పడింది. చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

Updated : 17 Jun 2024 21:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప 2’ (Pushpa) విడుదల వాయిదా పడింది. ఆగస్టు 15న రిలీజ్‌ చేయాల్సిన ఈ సినిమాని డిసెంబరు 6న (Pushpa Release Date) ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు మేకర్స్‌ సోమవారం ప్రకటించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ‘‘పుష్ప 1’ ఘన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ‘పుష్ప 2’ని మరింత శ్రద్ధతో తెరకెక్కిస్తున్నాం. నిర్విరామంగా పనిచేస్తున్నా ఇంకా చిత్రీకరణ మిగిలి ఉంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌కూ సమయం పడుతుంది. అందుకే ఆగస్టు 15న సినిమాని విడుదల చేయలేకపోతున్నాం. ఎన్నో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాం. మంచి క్వాలిటీతో చిత్రాన్ని మీకు అందించాలన్నదే మా లక్ష్యం’’ అని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ పేర్కొంది.

‘పుష్ప 2’ని తిరస్కరించారా?: విజయ్‌ సేతుపతి సమాధానమేంటంటే

అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) తెరకెక్కిస్తున్న చిత్రమిది. రష్మిక (Rashmika) హీరోయిన్‌. పార్ట్‌ 1 బ్లాక్‌ బస్టర్‌ కావడంతో పార్ట్‌ 2పై తొలి నుంచే ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలు వాటిని రెట్టింపు చేశాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే సన్నివేశాలతోపాటు కొన్ని కీలక సీన్లను తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం వచ్చిన (2021 డిసెంబరు 17) మూడేళ్లకు రెండో భాగం రానుండటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు