pushpa: ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ చిత్రం ‘పుష్ప ది రైజ్‌‌’

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతేడాది విడుదలైన ‘పుష్ప ది రైజ్‌’(Pushpa The Rise) ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. దేశవ్యాప్తంగా పుష్ప మ్యానరిజం...

Published : 15 Jul 2022 01:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతేడాది విడుదలైన ‘పుష్ప ది రైజ్‌’(Pushpa: The Rise) ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. దేశవ్యాప్తంగా పుష్ప మ్యానరిజం, స్టెప్పులు, పాటలు సోషల్‌ మీడియాలో హోరెత్తించాయి. విడుదలైన అన్ని భాషల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి రానున్న ‘పుష్ప ది రూల్‌‌’(Pushpa The Rule)పై అంచనాలు పెంచేసింది. ‘పుష్ప: ది రైజ్‌’ హిట్‌ అవ్వడానికి కారణమైన ప్రధాన అంశాల్లో మ్యూజిక్‌ ఒకటి. దేవి శ్రీ ప్రసాద్‌(Devi Sri Prasad) సంగీతం అందించిన పాటలు తెలుగులోనే కాకుండా హిందీ, తమిళంలో కూడా సూపర్‌డూపర్‌ హిట్టయ్యాయి. అల్లు అర్జున్‌(Allu Arjun), రష్మిక (Rashmika Mandanna) స్టెప్పులకు భారీ స్పందన లభించింది. అయితే ప్రస్తుతం ‘పుష్ప: ది రైజ్‌’ యూట్యూబ్‌లో ఒక అరుదైన రికార్డు సాధించింది. ఏ సినిమాకు సాధ్యం కాని రికార్డును ‘పుష్ప ది రైజ్‌’ ఆల్బమ్‌ నమోదు చేసింది. ఈ సినిమాలోని పాటలు మొత్తం కలిపి యూట్యూబ్‌లో 5బిలియన్‌ వ్యూస్‌ సాధించాయి. అంటే 500కోట్ల వీక్షకులను అలరించిన పాటలున్న చిత్రంగా ఈ సినిమా ఆల్బమ్‌ రికార్డులకెక్కింది. ఇండియాలో ఈ రికార్డు సాధించిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని