Pushpa: అప్పుడు రిజెక్ట్‌ చేశారు.. ఇప్పుడు హిందీ ‘పుష్ప’ వాయిస్‌తో క్రేజ్‌ తెచ్చుకున్నాడు!

పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’ టాలీవుడ్‌లోనే కాకుండా ఇతర భాషల్లోనూ క్రేజ్‌ సంపాదించుకుంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ‘పుష్ప’ హవా కొనసాగుతోంది. ఉత్తరాది హీరో చిత్రాలకు గట్టి పోటీ ఇస్తుంది. అయితే హిందీ ‘పుష్ప’కి మాత్రం డబ్బింగ్‌ చెప్పింది అల్లు అర్జున్‌ కాదు.

Published : 20 Jan 2022 23:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’ తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంతో అల్లు అర్జున్‌ ఉత్తరాది హీరోల చిత్రాలకు గట్టి పోటీ ఇచ్చాడు. ముఖ్యంగా బాలీవుడ్‌ ప్రేక్షకులకు అల్లు అర్జున్‌ నటనకు ఫిదా అవుతున్నారు. అందుకు కారణం బన్ని నటనతో పాటు, ఆయన ఆహార్యానికి సరిపోయేలా శ్రేయాస్‌ తల్పాడే డబ్బింగ్‌ చెప్పటం. ‘ఓం శాంతి ఓం’లో షారుఖ్‌తో కలిసి నటించిన శ్రేయాస్‌ తల్పడే ‘పుష్ప’లో పుష్పరాజ్‌ పాత్రకు డబ్బింగ్‌ చెప్పారు. బన్ని హావభావాలకు తన గొంతులో మరింత అందాన్ని తీసుకొచ్చాడు. దీంతో ఈ చిత్రం ప్రేక్షకులకు మరింత చేరువైంది.

ఈ సందర్భంగా శ్రేయాస్‌ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కెరీర్‌ ప్రారంభించినప్పటి రోజులను గుర్తుతెచ్చుకొని భావోద్వేగానికి గురయ్యారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒక్క పనీ ఉండేది కాదు. అప్పుడే నా పరిస్థితి గమనించిన నా మిత్రుడొకరు ‘డబ్బింగ్‌ చెప్పు.. కొంత డబ్బు అయినా వస్తుంది’ అని సలహా ఇచ్చారు. అతను చెప్పినట్లే డబ్బింగ్‌ ఆడిషన్‌ ఇవ్వడానికి వెళ్లినప్పుడు నన్ను రిజెక్ట్‌ చేశారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకూ ప్రతీదీ ఒక ఎగ్జైటింగ్‌, అడ్వెంచరెస్‌ జర్నీ. ఈ ఎత్తుపల్లాలను చూసిన నేను ఒకటి మాత్రం చెప్పగలను...‘‘అలలకు భయపడితే పడవ ముందుకు సాగదు. ప్రయత్నించే వాళ్లకి ఎప్పుడూ ఓటమి అనేది ఉండదు’’ అంటూ సందేశాన్ని ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని