Allu Arjun: ‘పుష్ప’ తెచ్చిన క్రేజ్‌.. ఇన్‌స్టాలో అల్లు అర్జున్‌ రికార్డు

‘పుష్ప’(pushpa) మూవీతో అల్లు అర్జున్‌(Allu arjun)కు పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ వచ్చింది.

Published : 16 Jan 2022 03:55 IST

హైదరాబాద: ‘పుష్ప’(pushpa) మూవీతో అల్లు అర్జున్‌(Allu arjun)కు పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ వచ్చింది. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్‌, యాక్షన్‌ థ్రిల్లర్‌ దక్షిణాది అభిమానులతో పాటు, హిందీ ప్రేక్షకులను మెప్పించింది. దీంతో అల్లు అర్జున్‌ దేశవ్యాప్తంగా అభిమానులు పెరిగారు. ప్రస్తుతం ఇన్‌స్టాలో ఆయనను అనుసరిస్తున్న వారి సంఖ్య 15 మిలియన్లు దాటింది. 

ఇన్‌స్టాలో 15 మిలియన్‌ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న తొలి దక్షిణాది నటుడిగా బన్ని రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు అభిమానులతో పాటు, సెలబ్రిటీలు సైతం ‘పుష్ప’లో అల్లు అర్జున్‌ డైలాగ్‌లను చెబుతూ సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటున్నారు. ‘తగ్గేదేలే’ అంటూ వాళ్లు చెబుతున్న డైలాగ్‌లు అలరిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని