Pushpa: రష్యాలోనూ పుష్ప తగ్గేదేలే!

భాషతో సంబంధం లేకుండా...  దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణని సొంతం చేసుకున్న ‘పుష్ప’ చిత్రం రష్యాలో విడుదలైంది.

Updated : 01 Dec 2022 11:19 IST

భాషతో సంబంధం లేకుండా...  దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణని సొంతం చేసుకున్న ‘పుష్ప’ (Pushpa) చిత్రం రష్యాలో విడుదలైంది. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనల్లో పాల్గొనేందుకు ‘పుష్ప’ బృందం కూడా బయల్దేరి వెళ్లింది.  అక్కడ ఓ కార్యక్రమంలో ‘పుష్ప’ చిత్రంలోని తగ్గేదేలే మేనరిజమ్‌ని ఆ చిత్రబృందం ప్రదర్శిస్తూ ఇలా ఫొటోలకి పోజులిచ్చింది. అల్లు అర్జున్‌ (Allu arjun), రష్మిక జంటగా సుకుమార్‌ (Sukumar) తెరకెక్కించిన ‘పుష్ప’కి కొనసాగింపుగా రూపొందుతున్న ‘పుష్ప2’ చిత్రీకరణ ఇప్పటికే షురూ అయ్యింది. రష్యా నుంచి రాగానే చిత్రీకరణ కోసం రంగంలోకి దిగనుంది సినిమా బృందం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని