Pushpa 2: విడుదలపై స్పష్టత ఇస్తారా?

‘పుష్ప’ చిత్రంతో జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలోనూ ఆదరణ దక్కించుకున్నారు కథానాయకుడు అల్లు అర్జున్‌. ఈ నేపథ్యంలోనే ఇప్పుడాయన నుంచి రానున్న ‘పుష్ప 2’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Updated : 12 Nov 2022 08:47 IST

‘పుష్ప’ (Pushpa) చిత్రంతో జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలోనూ ఆదరణ దక్కించుకున్నారు కథానాయకుడు అల్లు అర్జున్‌ (Allu Arjun). ఈ నేపథ్యంలోనే ఇప్పుడాయన నుంచి రానున్న ‘పుష్ప 2’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ అంచనాల్ని దృష్టిలో పెట్టుకునే రెండో భాగాన్ని అత్యున్నత సాంకేతిక హంగులతో ముస్తాబు చేసే ప్రయత్నం చేస్తోంది చిత్ర బృందం. అంతేకాదు చిత్రీకరణ దశ నుంచే ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే వచ్చే నెలలో ‘పుష్ప 2’కు సంబంధించిన చిన్న వీడియో గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రచార చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే అల్లు అర్జున్‌పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో అల్లు అర్జున్‌ (Allu Arjun) లేని సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. డిసెంబరు 16న విడుదల కానున్న ‘అవతార్‌ 2’ సినిమాతో పాటే ఈ చిత్ర గ్లింప్స్‌ను బయటకు వదిలేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రచార చిత్రాన్ని భారతీయ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో ద్వారానే చిత్ర విడుదల తేదీపైనా స్పష్టత ఇవ్వనున్నారని సమాచారం. సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక ( Rashmika) కథానాయిక.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని