దేవరకొండవారి ‘పుష్పక విమానం’!

మన చుట్టూ ఉండే కథలనే సినిమాలుగా ఎంచుకుంటూ ప్రత్యేకత చాటుకుంటున్నారు ఆనంద్‌ దేవరకొండ. తన అన్నయ్య విజయ్‌దేవరకొండ నీడలో ఇండస్ట్రీకి వచ్చినా మాస్‌ కథల జోలికి పోకుండా సామన్య పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇటీవలే ‘మిడిల్‌క్లాస్‌

Published : 01 Mar 2021 19:59 IST

హైదరాబాద్‌: మన చుట్టూ ఉండే కథలనే సినిమాలుగా చేస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు ఆనంద్‌ దేవరకొండ. తన అన్నయ్య విజయ్‌దేవరకొండ నీడలో ఇండస్ట్రీకి వచ్చినా మాస్‌ కథల జోలికి పోకుండా సామాన్య పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇటీవలే ‘మిడిల్‌క్లాస్‌ మెలోడీస్‌’తో డీసెంట్‌ హిట్‌ కొట్టి ‘పుష్పక విమానం’అంటూ మరో చిత్రంతో రెడీ అవుతున్నారు.

తాజాగా ఆ సినిమా పోస్టర్‌ను నటుడు విజయ్‌దేవరకొండ విడుదల చేశారు. ఆయనే నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం ప్రత్యేకం. ఆ పోస్టర్‌లో సునీల్‌తోపాటు నరేష్‌ వంటి సీనియర్‌ నటులు కనిపిస్తుండటం విశేషం. డార్క్‌ కామెడీతో ఈ చిత్రం ప్రేక్షకులను గిలిగింతలు పెట్టడం ఖాయం అంటూ విజయ్‌ పోస్ట్‌లో రాసుకొచ్చారు. అప్పట్లో కమల్‌హాసన్‌, అమల జంటగా సింగితం శ్రీనివాసరావు డైరెక్షన్‌లో ‘పుష్పక విమానం’ పేరుతో వచ్చిన మూకీ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సంగతి తెలిసిందే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని