Published : 13 Oct 2020 01:26 IST

టీనేజర్లయినా ఆ రాక్షసుల్ని వదలొద్దు: మాధవన్‌

ధోనీ కుమార్తెకు బెదిరింపులపై..

ముంబయి: క్రికెటర్ ఎమ్‌.ఎస్‌. ధోనీ కుమార్తె జీవాపై గుర్తు తెలియని వ్యక్తులు ఆన్‌లైన్‌లో బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఓ టీనేజర్‌ను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో చిన్నారికి హాని చేస్తామని బెదిరించిన వారిపై ప్రముఖ నటుడు మాధనవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ‘ఎమ్‌.ఎస్‌. ధోనీ కుమార్తెపై బెదిరింపులకు పాల్పడినందుకు ఓ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల పనితీరు ప్రశంసించదగ్గది. ఇలాంటి వాటికి స్వస్తి పలకాల్సిన సమయం ఇది. ఇంటర్నెట్‌లో ఇష్టానుసారంగా మాట్లాడొచ్చు, ఏదైనా చేయొచ్చు అనుకునే ఇలాంటి ముఖాలు లేని (గుర్తింపు లేని)  రాక్షసులకు చట్టం అంటే ఏంటో చూపించాలి. వారిలో భయం పుట్టించాలి. వాళ్లు టీనేజర్లు అయినా సరే..’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాధవన్‌తోపాటు పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఈ ఘటనపై అసహనం వ్యక్తం చేశారు. అభం శుభం తెలియని చిన్నారిపై బెదిరింపులకు పాల్పడిన వారిని శిక్షించాలని కోరారు.
ఐపీఎల్ 2020లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఓడిపోయిన నేపథ్యంలో కొందరు నెటిజన్లు ధోనీ కుమార్తెపై చేసిన కామెంట్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయి. ధోనీ, సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో అసభ్యంగా కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో గుజరాత్‌కు చెందిన టీనేజర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘ధోనీ, సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో అభ్యంతరకరంగా కామెంట్లు చేసిన కేసులో నామ్నా కపయ గ్రామానికి చెందిన 12 ఏళ్ల విద్యార్థిని అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నాం. టీనేజర్‌ కామెంట్లు చేసినట్లు ఒప్పుకున్నాడు’ అని సీనియర్‌ పోలీసు అధికారి సౌరభ్‌ సింగ్‌ మీడియాతో అన్నారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని