Cinema Lovers Day: రూ.99కే సినిమా టికెట్.. ఆ ఒక్కరోజు మాత్రమే!
ప్రేమికుల కోసం పీవీఆర్ సినిమాస్ రూ.99కే టికెట్‌ను అందిస్తోంది.
హైదరాబాద్: మీరు సినిమా ప్రేమికులా? అతి తక్కువ ధరకు టికెట్ కోసం చూస్తున్నారా? ఇటీవల విడుదలైన సినిమాలను తక్కువ ధరకే చూడాలనుకుంటున్నారా? అయితే, ఆ అవకాశాన్ని తాము ఇస్తామంటోంది పీవీఆర్ సినిమాస్ (PVR Cinemas). సాధారణంగా మల్టీప్లెక్స్‌లో సినిమా చూడాలంటే టికెట్ ధర రూ.200పైనే ఉంటుంది. కానీ, సినిమా ప్రేమికుల కోసం పీవీఆర్ సినిమాస్ రూ.99కే టికెట్‌ను అందిస్తోంది. జనవరి 20వ తేదీన పీవీఆర్ సినిమాస్‌లో అన్ని షోలను రూ.99 చొప్పున చూడవచ్చు. ‘సినిమా లవర్స్ డే’ సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటించింది. టికెట్ ధరకు జీఎస్టీ అదనం. ఎంపిక చేసిన నగరాల్లో ఈ అవకాశాన్ని ఇస్తున్నారు.
- ఈ ఆఫర్ కేవలం జనవరి 20, 2023న మాత్రమే
- చండీగఢ్, పఠాన్‌కోఠ్, పుదుచ్చేరి నగరాల్లో ఉన్న పీవీఆర్ సినిమాలో ఈ ఆఫర్ వర్తించదు.
- తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో టికెట్ ధర రూ.100+ జీఎస్‌టీ ఉంటుంది. తెలంగాణలో రూ.112+జీఎస్‌టీ వర్తిస్తుంది.
- ప్రీమియం కేటగిరి సీట్స్ (రెక్లెయినర్, ఐమ్యాక్స్, 4డీఎక్స్ తదితర సమాన స్థాయిలు కలిగిన సీట్లు) ఈ ఆఫర్ పరిధిలోకి రావు.
- జనవరి 20న ఇతర ఏ ఆఫర్లు వర్తించవు. పూర్తి షరతులు వర్తిస్తాయి. మరిన్ని వివరాలకు పీవీఆర్ సినిమాస్ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Couple Suicide: నిస్సహాయ స్థితిలో దంపతుల ఆత్మహత్య!
-
Politics News
EC: వయనాడ్ ఖర్చులు సమర్పించని ‘రాహుల్’పై ఈసీ వేటు!
-
India News
Ram Ramapati Bank: శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
Ts-top-news News
Summer: మండే వరకు ఎండలే.. ఏడు జిల్లాలకు హెచ్చరికలు
-
Crime News
Andhra News: సీఎం జగన్‌పై పోస్టులు పెట్టారని ప్రవాసాంధ్రుడి అరెస్టు
-
Crime News
Vijayawada: వేడినీళ్ల బకెట్లో పడి 8 నెలల శిశువు మృతి