R Madhavan: మాధవన్‌పై నెటిజన్ల విమర్శలు.. సైన్స్‌ తెలియకపోతే సైలెంట్‌గా ఉండు..!

ప్రముఖ ఇస్రో(ISRO) శాస్త్రవేత్త నంబి నారాయణ్‌(Nambi Narayanan) జీవితాన్ని ఆధారంగా చేసుకుని నటుడు మాధవన్‌(Madhavan) తెరకెక్కించిన చిత్రం.... 

Updated : 26 Jun 2022 14:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఇస్రో(ISRO) శాస్త్రవేత్త నంబి నారాయణ్‌(Nambi Narayanan) జీవితాన్ని ఆధారంగా చేసుకుని నటుడు మాధవన్‌(Madhavan) తెరకెక్కించిన చిత్రం ‘రాకెట్రీ’(Rocketry). మాధవన్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం సినీ, సైన్స్‌ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో మాధవన్‌ చేసిన పలు వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట ట్రోల్స్‌ ఎదుర్కొంటున్నాయి. సైన్స్‌ తెలియకపోతే మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండు.. అంటూ వారు ఏకేస్తున్నారు. ఇంతకీ ఏమైందంటే..

‘రాకెట్రీ’ ప్రమోషన్స్‌లో భాగంగా మాధవన్‌, ఆయన టీమ్‌ వివిధ ప్రాంతాల్లో ప్రెస్‌మీట్లు నిర్వహిస్తోంది. ఇటీవల జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో అంతరిక్షంలోకి రాకెట్‌ను ప్రయోగించేందుకు, అది అంగారక కక్ష్యలోకి చేరేందుకు ఇస్రోకు పంచాంగం ఉపయోగపడిందని మాధవన్‌ అన్నారు. ఇస్రో వాళ్లు పంచాంగం చూసి పెట్టిన ముహూర్తబలం వల్లే భారత మార్స్‌ మిషన్‌ అవాంతరాలను అధిగమించిందని  ఆయన వ్యాఖ్యానించారు. గ్రహాల స్థితిగతులన్నీ పంచాంగాల్లో నిక్షిప్తమై ఉంటాయని మాధవన్ చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆయన్ని విపరీతంగా ట్రోల్స్‌ చేస్తున్నారు. ‘‘సైన్స్‌ అందరికీ అర్థమయ్యే విషయం కాదు. సైన్స్‌ తెలియకపోవడం కూడా సమస్య కాదు. కానీ, అసలు విషయం తెలుసుకోకుండా ఇలాంటివి మాట్లాడే బదులు సైలెంట్‌గా ఉండటం మంచిది’’, ‘‘ఇదేం పిచ్చి మాటలు’’, ‘‘మీరు మాట్లాడే మాటలకు ఏదైనా అర్థం ఉందా?’’ అని నెటిజన్లు వరుస కామెంట్స్‌ చేస్తున్నారు. తమిళం, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ‘రాకెట్రీ’ ప్రపంచవ్యాప్తంగా జులై 1న విడుదల కానుంది. షారుఖ్‌, సూర్య ఈ సినిమాలో కీలకపాత్రల్లో కనిపించనున్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు