R Madhavan: బ్రెత్‌లెస్‌ సాంగ్‌ భలే పాడారు.. ఎలా సాధ్యమైంది?

ప్రముఖ నటుడు ఆర్‌. మాధవన్‌ ఈటీవీలో ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కార్యక్రమం గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. చాలా మందిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితేసే గొప్పప్రయత్నంగా నిలుస్తుంది ఈ షో. 

Updated : 25 Nov 2021 17:43 IST

 ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో బ్రెత్‌లెస్‌ సాంగ్‌ పాడిన సింగర్‌కు మాధవన్‌ అభినందనలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు ఆర్‌. మాధవన్‌ ఈటీవీలో ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కార్యక్రమం గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.   సెప్టెంబర్‌12న ప్రసారమైన ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ట్విన్స్‌ సింగర్‌ స్పెషల్‌ ఎపిసోడ్‌ అందరినీ ఆకట్టుకుంది. అందులో స్వర-జయన్‌ అనే కవలల్లో స్వర అనే గాయకుడు శంకర్‌ మహదేవన్‌ ఆలపించిన బ్రెత్‌లెస్‌ సాంగ్‌ని ‌(Breathless Song) 2 నిమిషాల 24 సెకన్ల పాటు నాన్‌స్టాప్‌గా పాడారు. కాగా ఆ పాటకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌ను మాధవన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘ ఏ మాత్రం బ్రేక్స్‌ ఇవ్వకుండా పాడటం అసలు ఎలా సాధ్యమైంది. పాడేకొద్ది సేపు ఇతను ఊపిరి తీసుకున్నట్లు కూడా అనిపించలేదు. భగవంతుడు అతడికి గొప్ప టాలెంట్‌ని అందించాడు’’ అని అభినందించారు. ఇదే పాటను ఇండియన్‌ ఐడల్‌ -5 ఫినాలే వేదికపై సింగర్‌ శ్రీరామ చంద్ర పాడారని.. ఆ తరువాత అదే రీతిలో పాడింది స్వర అంటూ షోలో చెప్పాడు యాంకర్‌ సుడిగాలి సుధీర్‌.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని