అభిమాని లవ్‌ ప్రపోజల్‌.. మాధవన్‌ రిప్లై

సెలెబ్రిటీలకు సోషల్‌ మీడియాలో ఎన్నో లవ్‌ ప్రపోజల్స్‌ వస్తుంటాయి. అది మాధవన్‌లాంటి అందమైన హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ప్రపోజ్‌డేను పురస్కరించుకొని పూజా అనే యువతి హీరో మాధవన్‌కు వినూత్నంగా తన ప్రేమను వ్యక్తం చేసింది.

Published : 10 Feb 2021 01:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సెలెబ్రిటీలకు సోషల్‌ మీడియాలో ఎన్నో లవ్‌ ప్రపోజల్స్‌ వస్తుంటాయి. అది మాధవన్‌లాంటి అందమైన హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ప్రపోజ్‌డేను పురస్కరించుకొని పూజా అనే యువతి హీరో మాధవన్‌కు వినూత్నంగా తన ప్రేమను వ్యక్తం చేసింది. ‘ప్రపంచంలో 8 గ్రహాలు, 204 దేశాలు, 7 సముద్రాలు, 7,707 ద్వీపాలు, 7.8 బిలియన్ ప్రజలూ ఉన్నారు. నేను మరణించేవరకూ మిమ్మల్ని ప్రేమిస్తా. దయచేసి నా ప్రేమ ప్రతిపాదన అంగీకరించండి. మీరే నా జీవితం. నా విశ్వం. నా సౌర వ్యవస్థ. నాకు అన్నీ మీరే’ అని ఆమె తన ప్రేమను వ్యక్త పరిచింది.

ఈ పోస్టుపై మాధవన్‌ స్పందించారు. ‘దేవుడు నిన్ను చల్లగా చూడాలి. మీ ప్రేమకు కృతజ్ఞతలు’ అని రీట్వీట్‌ చేశారు. తమిళ పరిశ్రమకు చెందిన మాధవన్‌ తెలుగు, హిందీ ఇలా ఏడు భాషల్లో సినిమాలు చేశారు. తెలుగులో నాగచైతన్య హీరోగా వచ్చిన ‘సవ్యసాచి’, అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘నిశ్శబ్దం’ సినిమాల్లో ప్రతినాయకుడిగా అలరించారు. నటుడిగానే కాకుండా పలు సినిమాలకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహించారు. ప్రస్తుతం ఆయన ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్’ అనే త్రిభాష చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అది తమిళంతో పాటు హిందీ, ఇంగ్లీష్‌లోనూ విడుదల కానుంది.
ఇవీ చదవండి..

‘పీఎస్‌పీకే 27’ కోసం చార్మినార్‌

బాలీవుడ్‌లో మరో విషాదం.. రాజీవ్‌కపూర్‌ మృతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని