Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
ఇంటర్నెట్‌డెస్క్: ప్రముఖ ఇస్రో(ISRO) శాస్త్రవేత్త నంబి నారాయణ్(Nambi Narayanan) జీవితాన్ని ఆధారంగా చేసుకుని నటుడు మాధవన్ (Madhavan) తెరకెక్కించిన చిత్రం ‘రాకెట్రీ’ (Rocketry). మాధవన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై తాజాగా మాధవన్ స్పందించారు. ఈ విమర్శలకు తాను అర్హుడినేనన్న మాధవన్.. రాకెట్లను ప్రయోగించడానికి ఇస్రోకు పంచాంగం ఉపయోగపడిందని మాట్లాడటం తన అజ్ఞానమేనన్నారు. అయితే, తాను ఈ వ్యాఖ్యలు చేసినంత మాత్రాన రెండు ఇంజిన్లను ఉపయోగించి మార్స్ మిషన్ విజయవంతం చేయడం నిజం కాకుండా పోదన్నారు. అది ఎప్పటికీ రికార్డేనని చెప్పుకొచ్చారు.
ఇంతకీ ఏం జరిగిందంటే?
‘రాకెట్రీ’ ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ప్రెస్మీట్లో అంతరిక్షంలోకి రాకెట్‌ను ప్రయోగించేందుకు, అది అంగారక కక్ష్యలోకి చేరేందుకు ఇస్రోకు పంచాంగం ఉపయోగపడిందని మాధవన్ అన్నారు. ఇస్రో వాళ్లు పంచాంగం చూసి పెట్టిన ముహూర్తబలం వల్లే భారత మార్స్ మిషన్ అవాంతరాలను అధిగమించిందని ఆయన వ్యాఖ్యానించారు. గ్రహాల స్థితిగతులన్నీ పంచాంగాల్లో నిక్షిప్తమై ఉంటాయని మాధవన్ చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆయన్ని విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ‘‘సైన్స్ అందరికీ అర్థమయ్యే విషయం కాదు. సైన్స్ తెలియకపోవడం కూడా సమస్య కాదు. కానీ, అసలు విషయం తెలుసుకోకుండా ఇలాంటివి మాట్లాడే బదులు సైలెంట్‌గా ఉండటం మంచిది’’, ‘‘ఇదేం పిచ్చి మాటలు’’, ‘‘మీరు మాట్లాడే మాటలకు ఏదైనా అర్థం ఉందా?’’ అని నెటిజన్లు వరుస కామెంట్స్ చేయడంతో మాధవన్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తమిళం, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ‘రాకెట్రీ’ ప్రపంచవ్యాప్తంగా జులై 1న విడుదల కానుంది. షారుఖ్, సూర్య ఈ సినిమాలో కీలకపాత్రల్లో కనిపించనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/08/2022)
-
World News
Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
-
India News
Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
-
Sports News
T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
-
Viral-videos News
Viral Video: రోడ్డుపై నీటి గుంత.. అందులోనే స్నానం చేస్తూ వ్యక్తి నిరసన!
-
Movies News
Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
- Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..
- Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
- Arthroscopy: మీ మోకీలుకు నొప్పి ఎక్కువగా ఉందా..? ఏం చేయాలో తెలుసా..!
- Jaishankar: సరికొత్త ఆలోచనలతో చకచకా చేస్తున్నారు.. సిబ్బందికి కేంద్ర మంత్రి ప్రశంసలు
- Gali Janardhana Reddy: ‘గాలి’ అడిగితే కాదంటామా!
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!