R Narayana Murthy: ఉద్యోగ భారతం కోసం...
మన దేశం నిరుద్యోగ భారతం కాదు... ఉద్యోగ భారతం కావాలని చాటి చెప్పే ప్రయత్నమే మా చిత్రం అంటున్నారు ఆర్.నారాయణమూర్తి.
మన దేశం నిరుద్యోగ భారతం కాదు... ఉద్యోగ భారతం కావాలని చాటి చెప్పే ప్రయత్నమే మా చిత్రం అంటున్నారు ఆర్.నారాయణమూర్తి. ఆయన ప్రధాన పాత్రధారిగా నటిస్తూ... స్వీయ దర్శక నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం ‘యూనివర్సిటీ’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాని జూన్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలియజేశారు ఆర్.నారాయణమూర్తి. ఆయన మాట్లాడుతూ ‘‘పదో తరగతి మొదలుకొని గ్రూప్ 1, 2లాంటి ఉద్యోగ నియామకాల పరీక్షల్లోనూ పేపర్ లీకేజీలు జరిగితే విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలని ప్రశ్నిస్తూనే వినోదం పంచే చిత్రమిది. విద్యా వ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థల నేపథ్యంలో చర్చించిన అంశాలు ఆసక్తిని కలిగిస్తాయి. ఆలోచనని రేకెత్తిస్తాయి’’ అన్నారు. ఈ చిత్రానికి పాటలు: గద్దర్ - నిస్సార్ - మోటపలుకులు రమేష్ - వేల్పుల నారాయణ, ఛాయాగ్రహణం: బాబూరావు దాస్, కూర్పు: మాలిక్.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/09/2023)
-
Interpol: ఖలిస్థాన్ ఉగ్రవాది కరణ్వీర్సింగ్ కోసం రెడ్కార్నర్ నోటీస్ జారీ చేసిన ఇంటర్పోల్
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Salaar: ‘సలార్’ రిలీజ్ ఆరోజేనా?.. వైరల్గా ప్రశాంత్ నీల్ వైఫ్ పోస్ట్
-
Andhra news: ఐబీ సిలబస్ విధివిధానాల కోసం కమిటీల ఏర్పాటు
-
Ram Pothineni: ‘స్కంద’ మాస్ చిత్రం మాత్రమే కాదు..: రామ్