Anjali: పాప ఎప్పుడూ రెడీనే.. ఐటమ్‌ సాంగ్‌లో అదరగొట్టిన అంజలి

‘ఐ యామ్‌ రెడీ.. నన్ను ఎట్టాగా పిలిచినా రెడీ.. వచ్చి నా సోకులిస్తా వడ్డీ.. మల్లెపువ్వులాంటి ఒళ్లు సెంటు బుడ్డి’ అంటూ ఐటమ్‌లో సాంగ్‌లో అదరగొట్టింది నటి అంజలి.

Updated : 07 Dec 2022 21:26 IST

హైదరాబాద్‌: ‘ఐ యామ్‌ రెడీ.. నన్ను ఎట్టాగా పిలిచినా రెడీ.. వచ్చి నా సోకులిస్తా వడ్డీ.. మల్లెపువ్వులాంటి ఒళ్లు సెంటు బుడ్డి’ అంటూ ఐటమ్‌లో సాంగ్‌లో అదరగొట్టింది నటి అంజలి. నితిన్‌ (Nithiin) కథానాయకుడిగా ఎమ్‌.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి (Rajasekhar Reddy) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం. కృతిశెట్టి (Krithi Shetty), కేథరిన్‌ (Catherine) కథానాయికలు. శ్రేష్ట్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్నారు. ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాలో ‘రా రా రెడ్డి.. ఐ యామ్‌ రెడీ’ అంటూ సాగే  ప్రత్యేక గీతం లిరికల్‌ సాంగ్‌ను శనివారం విడుదల చేశారు.  ఆ పాటలో అంజలి ఆడిపాడారు. మహతి స్వర సాగర్‌ అందించిన స్వరాలకు కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించారు. అంతే జోష్‌తో లిప్సికా ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

‘‘రాజకీయ అంశాలతో కూడిన పక్కా వాణిజ్య చిత్రమిది. నితిన్‌ యువ ఐఏఎస్‌ అధికారిగా సందడి చేయనున్నారు. చిత్రీకరణ, నిర్మాణానంతర కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ సినిమాకి అంజలి ప్రత్యేక గీతం ప్రధాన ఆకర్షణ. హైదరాబాద్‌ లో వేసిన ఓ భారీ సెట్‌లో ఆ పాటని తెరకెక్కించామ’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మూరెళ్ల, మాటలు: మామిడాల తిరుపతి, కళ: సాహి సురేష్‌, కూర్పు:  కోటగిరి వెంకటేశ్వరరావు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని