RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కొత్త పాట..‘రామమ్‌ రాఘవమ్‌..’ అద్భుతం!

సినీ ప్రియులకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం న్యూ ఇయర్‌ కానుకను అందించింది. ‘రైజ్‌ ఆఫ్‌ రామ్‌’ పేరిట ఓ మ్యూజిక్‌ వీడియోను ..

Updated : 31 Dec 2021 22:39 IST

హైదరాబాద్‌: సినీ ప్రియులకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం కొత్త సంవత్సర కానుకను అందించింది. ‘రైజ్‌ ఆఫ్‌ రామ్‌’ పేరిట ఓ పాటను విడుదల చేసింది. ‘రామం రాఘవమ్‌ రణధీరం రాజసం...’ అంటూ అల్లూరి సీతారామరాజు పోరాటాన్ని ఆవిష్కరిస్తూ సాగిన ఈ పాటలో అల్లూరి పాత్రలో రామ్‌ చరణ్‌ అద్భుతంగా కనిపించారు. ఈ పాటకు కె.శివశక్తి దత్త లిరిక్స్‌ అందించగా.. ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు. విజయ్‌ ప్రకాశ్‌, చందనా బాల కల్యాణ్‌, చారు హరిహరన్‌ బృందంగా ఈ పాటను ఆలపించారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Cinema News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని