Raashi Khanna: డైరెక్టర్‌ మారుతి అప్పుడే మాటిచ్చారు: రాశీఖన్నా

ఇప్పటివరకూ తాను పోషించిన పాత్రలన్నింటిలోకెల్లా ‘పక్కా కమర్షియల్‌’లో చేసిన ఝాన్సీ రోల్‌ ది బెస్ట్ అని అంటున్నారు నటి రాశీఖన్నా. లాయర్‌ ఝాన్సీగా ఆమె నటించిన సరికొత్త చిత్రం ‘పక్కా కమర్షియల్‌’....

Updated : 07 Dec 2022 14:50 IST

హైదరాబాద్‌: ఇప్పటివరకు తాను పోషించిన పాత్రలన్నింటిలోకెల్లా ‘పక్కా కమర్షియల్‌’లో చేసిన ఝాన్సీ పాత్ర ది బెస్ట్ అని అంటున్నారు నటి రాశీఖన్నా. గోపీచంద్‌ కథానాయకుడిగా నటిస్తోన్న ‘పక్కా కమర్షియల్‌’ సినిమాలో రాశీ.. న్యాయవాదిగా కన్పించనున్నారు. ఈ చిత్రానికి మారుతి దర్శకుడు. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ సినిమా జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా రాశీఖన్నా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరీర్‌లో ఇప్పటివరకూ చేసిన పాత్రలు, ఇష్టాయిష్టాలు పంచుకున్నారు.

‘‘దర్శకుడు మారుతితో ఇది నా రెండో సినిమా. ఆయన దర్శకత్వం వహించిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలో నటించాను. అందులో నేను పోషించిన ‘ఏజెంల్‌ ఆర్నా’ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమా చూసినవాళ్లు చాలా మంది ఏంజెల్‌ ఆర్నా పాత్ర ఇంకాస్త ఉండుంటే బాగుండేదనుకున్నారు. దాంతో మారుతి.. తదుపరి చిత్రంలో మంచి రోల్‌ క్రియేట్‌ చేస్తానని ఆ సమయంలో నాకు మాటిచ్చారు. అలా, ‘పక్కా కమర్షియల్‌’ కోసం ఆయనతో మరోసారి టీమ్‌ అప్‌ కావాల్సి వచ్చింది. ఇందులో నా రోల్‌ ఎంతో ఫన్నీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేస్తారు. ఇప్పటివరకూ నేను పోషించిన పాత్రల్లోకెల్లా ఇదే ది బెస్ట్‌ రోల్‌’’ అని రాశీ తెలిపారు. ‘ఊహలు గుసగుసలాడే’ నుంచి ఇప్పటివరకూ చేసిన సినిమాలన్నీ సంతృప్తినిచ్చాయని, భవిష్యత్తులో అవకాశం వస్తే నెగటివ్‌ రోల్‌, బాహుబలి సినిమాలో అనుష్క పోషించిన దేవసేన వంటి బలమైన పాత్రల్లో చేయాలనుకుంటున్నానని ఆమె అన్నారు.  ఇక, ఈ సినిమాలో సత్యరాజ్‌, రావు రమేశ్‌, అజయ్‌ ఘోష్‌, సప్తగిరి తదితరులు కీలకపాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్‌, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని