Raashi Khanna: యామినిగా నేను ఎవరికీ నచ్చలేదు: రాశీఖన్నా

దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ(Bollywood) వరుస సినిమాలు చేస్తూ.. సినీ ప్రియుల్ని అలరిస్తున్నారు నటి రాశీఖన్నా (Raashi Khanna). ప్రస్తుతం ‘పక్కా కమర్షియల్‌’ (Pakka Commercial) విజయాన్ని .....

Published : 02 Jul 2022 11:06 IST

హైదరాబాద్‌: దక్షిణాది, బాలీవుడ్‌లో(Bollywood) వరుస సినిమాలు చేస్తూ సినీ ప్రియుల్ని అలరిస్తున్నారు నటి రాశీఖన్నా (Raashi Khanna). ప్రస్తుతం ‘పక్కా కమర్షియల్‌’ (Pakka Commercial) విజయాన్ని ఎంజాయ్‌ చేస్తోన్న ఆమె తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పటివరకూ తాను పోషించిన పాత్రల్లో ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్ (World Famous Lover)’ చిత్రంలోని యామిని పాత్ర అంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.

‘‘ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. ఐఏఎస్‌ ఆఫీసరై.. ప్రజలకు సేవ చేయాలని మొదటి నుంచి ఎన్నో కలలు కన్నా. దేవుడు నాకోసం ఈ దారి రాసిపెట్టినట్టు ఉన్నారు. అందుకే నటిగా మారి అలరిస్తున్నా. ఇప్పటివరకూ నేను పోషించిన ప్రతి పాత్రను ఎంజాయ్‌ చేస్తూ చేశా. ‘ఊహలు గుసగుసలాడే’లోని ప్రభావతి, ‘తొలిప్రేమ’లోని వర్ష నాకెంతో నచ్చాయి. ముఖ్యంగా ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’లో యామిని పాత్రకు నేను బాగా కనెక్ట్‌ అయ్యా. కాకపోతే ఆ రోల్‌ ఎక్కువమందికి నచ్చలేదు. భవిష్యత్తులో మరిన్ని గొప్ప పాత్రల్లో నటించాలని ఉంది. నటిగా మారడం వల్లే నాకెంతోమంది అభిమానం దక్కింది. ‘ప్రతిరోజూ పండగే’ కోసం రాజమండ్రిలో షూటింగ్‌ చేస్తున్నప్పుడు ఓ అభిమాని నా వద్దకు వచ్చి.. నాకు వీరాభిమానినని చెప్పి, తన చేతిపై ఆటోగ్రాఫ్‌ ఇవ్వమని కోరాడు. ఆ తర్వాత రోజు నేను చేసిన సంతకాన్ని అతను పచ్చబొట్టు వేయించుకుని వచ్చాడు. ఆ క్షణం చాలా ఆనందంగా అనిపించింది. అభిమానులు నాపై చూపించే ప్రేమకు నేనెప్పుడూ కృతజ్ఞురాలినే’’ అని రాశీ తెలిపారు. అనంతరం తనకు కాబోయే భర్తకు దైవ భక్తి ఎక్కువగా ఉండాలని, మంచి మనసున్న వాడు కావాలని ఆమె చెప్పుకొచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని