Raashii Khanna: ఇంకో ఇరవయ్యేళ్లైనా ఇలాగే నా ప్రయాణం
‘‘దక్షిణాది - ఉత్తరాది... కంటెంట్ - కమర్షియల్... సినిమా... ఓటీటీ... - వీటన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ ప్రయాణం చేయడమే నా ముందున్న లక్ష్యం’’ అంటోంది కథానాయిక రాశీఖన్నా. పలు భాషల్లో నటించినా తెలుగుతో ఆమెకున్న అనుబంధం ప్రత్యేకమైనది.
‘‘దక్షిణాది - ఉత్తరాది... కంటెంట్ - కమర్షియల్... సినిమా... ఓటీటీ... - వీటన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ ప్రయాణం చేయడమే నా ముందున్న లక్ష్యం’’ అంటోంది కథానాయిక రాశీఖన్నా. పలు భాషల్లో నటించినా తెలుగుతో ఆమెకున్న అనుబంధం ప్రత్యేకమైనది. ఒకవైపు సినిమాలు చేస్తూనే... కొంతకాలంగా వెబ్ సిరీస్‌లపై కూడా దృష్టిపెట్టింది. ఇటీవల షాహిద్ కపూర్‌తో కలిసి ‘ఫర్జి’లో నటించింది. ఈ సందర్భంగా రాశీఖన్నా గురువారం విలేకర్లతో ముచ్చటించింది.
ఒకవైపు సినిమాలు... మరోవైపు వెబ్ సిరీస్‌లు సమాంతరంగా చేస్తున్నట్టున్నారు కదా?
ఓటీటీ వేదికలు నటులకి గొప్ప అవకాశాల్ని తెచ్చి పెడుతున్నాయి. వెబ్ షోలతో లోతైన పాత్రలు చేసే అవకాశం లభిస్తోంది. ఓటీటీ షోలపై ప్రేక్షకులు చూపెడుతున్న ఆసక్తి కూడా మరింత ప్రోత్సాహకరంగా ఉంది. అందుకే ఇటు సినిమాలు.. అటు వెబ్ సిరీస్‌లు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ప్రయాణం చేయాలనుకుంటున్నా. నాకు ఓటీటీ నుంచి వచ్చిన తొలి అవకాశం ‘ఫర్జి’. ‘ఫ్యామిలీ మేన్’ షోస్ తర్వాత రాజ్, డీకే దర్శకద్వయం చేసిన షో ఇది. ప్రేక్షకుల నుంచి షోకి లభిస్తున్న స్పందన ఎంతో తృప్తినిస్తోంది.
మీ సినిమా ప్రయాణం హిందీ నుంచే మొదలైంది. చాలా రోజుల తర్వాత మళ్లీ వెబ్ సిరీస్‌ల కోసం హిందీలో పనిచేశారు. ఆ అనుభవాలు పంచుకుంటారా?
నేనిప్పుడు గుర్తింపు సమస్యతో సతమతమవుతున్నా (నవ్వుతూ). హైదరాబాద్‌లో ఉంటే నన్ను నేను తెలుగమ్మాయిలానే భావిస్తా. తమిళనాడుకి వెళితే తమిళమ్మాయినే అనుకుంటా. హిందీకి వెళితే అది నా సొంత భాష కాబట్టి నేనక్కడి అమ్మాయిని అయిపోతాను. అయితే ‘ఫర్జి’ చేస్తున్నప్పుడు నిన్నిప్పుడంతా దక్షిణాది అమ్మాయిలానే చూస్తారని చెప్పారు దర్శకులు రాజ్ - డీకే.
తెలుగు సినిమా ప్రయాణం గురించి ఏం చెబుతారు? ఈమధ్య మీరు చేసిన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు కదా?
తెలుగు సినిమాల విషయంలో ఆశించిన ఫలితాలు రాలేదన్నది నిజమే. అయితే తెలుగులో అనువాదాలుగా వచ్చిన ‘సర్దార్’, ‘తిరు’ మాత్రం రూ.100కోట్లకిపైగా వసూలు చేశాయి. నటుల ప్రయాణంలో ఎత్తుపల్లాలు సహజం. తెలుగు ప్రేక్షకుల నాకు వాళ్ల హృదయాల్లో స్థానం ఇచ్చారు. అది దృష్టిలో ఉంచుకునే మంచి పాత్రల్ని ఎంపిక చేసుకుంటూ ప్రయాణం చేస్తున్నా.
నా ప్రయాణం ఇప్పుడే మొదలైనట్టు ఉంది. ఇంకో ఇరవయ్యేళ్లైనా తెరపై నటిస్తూనే ఉంటా. ఈ ప్రయాణాన్ని అంతగా ఆస్వాదిస్తున్నా. తెలుగులో మహేష్‌బాబుతో కలిసి నటించాలనే కోరిక ఎప్పట్నుంచో ఉంది. నాని, శర్వానంద్‌తోనూ ఇప్పటివరకు కలిసి నటించలేదు. ఎవరెవరితో పనిచేయలేదో వాళ్లందరితోనూ కలిసి సినిమా చేయాలని ఉంది.’
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Kerala: సమాధిపై క్యూఆర్ కోడ్!.. వైద్యుడైన కుమారుడి స్మృతులకు కన్నవారి నివాళి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Mission venus: 2028లో శుక్రగ్రహ మిషన్!: ఇస్రో అధిపతి సోమనాథ్
-
Ap-top-news News
AP High Court: క్రిమినల్ కేసు ఉంటే కోర్టు అనుమతితోనే పాస్‌పోర్టు పునరుద్ధరణ: హైకోర్టు
-
Sports News
Suryakumar Yadav: హ్యాట్రిక్ డక్.. తొలి బంతికే.. వరుసగా విఫలమవుతున్న సూర్యకుమార్
-
World News
UNO: స్వచ్ఛమైన తాగునీటికి దూరంగా 26 శాతం ప్రపంచ జనాభా