Raashii Khanna: షారుక్ ఖాన్‌ను ఎవరూ ఓడించలేరు: రాశీ ఖన్నా
ఇటీవల ఫర్జీ (Farzi) వెబ్ సిరీస్‌తో మెప్పించింది రాశీ ఖన్నా(Raashii Khanna) . తాజాగా ఆమె షారుక్ గురించి మాట్లాడుతూ ఆయన్ని ఎవరూ.. ఏ విషయంలోనూ ఓడించలేరని చెప్పింది.
హైదరాబాద్: సినిమాలతో పాటు వెబ్ స్టోరీల్లోనూ నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది రాశీ ఖన్నా (Raashii Khanna). ఇటీవల ఫర్జీ (Farzi) వెబ్ సిరీస్‌లో ఇద్దరు అగ్ర హీరోలతో పోటీపడుతూ నటించి ప్రశంసలు అందుకుంది. షాహిద్ కపూర్ (Shahid Kapoor), విజయ్ సేతుపతి (Vijay Sethupathi) తో కలిసి ఈ బ్యూటీ నటించిన ఈ వెబ్ సిరీస్ ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. దీంతో రాశీఖన్నా పేరు మారుమోగిపోయింది. ఫలితంగా ఐఎండీబీ (ఇండియన్ మూవీ డేటాబేస్) (IMDb list)ప్రచురించే పాపులర్ ఇండియన్ సెలబ్రెటీస్ జాబితాలో షారుక్ ఖాన్‌ను వెనక్కు నెట్టి రాశీ ఖన్నా మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై రాశీ మాట్లాడింది.
‘‘నాకు ఈ విషయం తెలియగానే ఎంతో ఆనందం వేసింది. వెంటనే మా నాన్నకు ఫోన్ చేశా. ఆయనకు ఐఎండీబీ గురించి పెద్దగా తెలీదు.. కానీ నేను షారుక్ (Shah Rukh Khan) కంటే మొదటి స్థానంలో ఉన్నానని చెప్పగానే ఆయన కూడా షాక్ అయ్యారు. ఇక నేను కూడా చాలా సేపు నమ్మలేదు. నిజమా లేదంటే నన్ను ఆటపట్టిస్తున్నారా అనుకున్నా. ఇలా జరగడం నా జీవితంలో ఓ మైలు రాయిగా భావిస్తా. షారుక్ కింగ్ ఖాన్.. ఆయనని ఎవరూ ఏ విషయంలోనూ ఓడించలేరు. నేను ఆయన కంటే మొదటి స్థానంలో ఉన్నానంటే అది కేవలం నేను నటించిన పాత్రకు దక్కిన ప్రేక్షకాదరణ మాత్రమే. ప్రజలు నా పాత్రను అంతగా ఇస్టపడ్డారు’’ అని రాశీ ఖన్నా చెప్పింది. అలాగే తనకు ప్రేమకథా చిత్రాలంటే ఇష్టమని.. అలాంటి సినిమాల్లో నటించాలని ఉందని తెలిపింది. ఇటీవల రుద్ర, ఫర్జీ వెబ్ సిరీస్‌లతో మెప్పించిన రాశీ ఖన్నా ప్రస్తుతం హిందీ, తమిళ భాషల్లో సినిమాలు చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nara Lokesh - AP High Court: లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ముగిసిన విచారణ
-
TCS: భారత్‌లో అత్యంత విలువైన బ్రాండ్ టీసీఎస్
-
ODI WC 2023: సూర్యకు వన్డేల్లో గొప్ప గణాంకాలు లేవు.. తుది జట్టులో తీవ్ర పోటీ: సన్నీ
-
పైకి లేచిన బ్రిడ్జ్.. కిందికి దిగలేదు: లండన్ ఐకానిక్ వంతెన వద్ద ట్రాఫిక్ జామ్
-
USA: ట్రూడో అనుకున్నదొకటి.. అయ్యిందొకటి: నిజ్జర్ ఊసెత్తని అమెరికా..!
-
Karnataka Bandh: ‘కావేరీ’ పోరు: స్తంభించిన కర్ణాటక.. 44 విమానాలు రద్దు