Radhe Shyam: ‘రాధేశ్యామ్‌’ మరో సర్‌ప్రైజ్‌.. ఏంటంటే?

ప్రభాస్‌ అభిమానులు, సినీ ప్రేక్షకులకు ‘రాధేశ్యామ్‌’ చిత్రం మరో కానుక అందింది. ఇప్పటికే ‘నగుమోము తారలే’ ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా ‘ఈ రాతలే’ ఫుల్‌ వీడియో గీతాన్ని పంచుకుంది.

Published : 24 Mar 2022 14:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ అభిమానులు, సినీ ప్రేక్షకులకు ‘రాధేశ్యామ్‌’ చిత్రం నుంచి మరో కానుక అందింది. ఇప్పటికే ‘నగుమోము తారలే’ ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా ‘ఈ రాతలే’ ఫుల్‌ వీడియో గీతాన్ని పంచుకుంది. ఈ పాటలోని ప్రభాస్‌ లుక్స్‌, పూజా క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, అద్భుతమైన లొకేషన్లు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. కృష్ణకాంత్‌ రచించిన ఈ గీతాన్ని యువన్‌ శంకర్‌ రాజా, హరిణి ఇవటూరి ఆలపించారు. జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరాలందించారు. పీరియాడికల్‌ థ్రిల్లర్‌ లవ్‌స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో హస్తసాముద్రికా నిపుణుడు విక్రమాదిత్యగా ప్రభాస్‌, ఆయన ప్రేయసి ప్రేరణగా పూజా అలరించారు. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్‌ ఖేడ్‌కర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని