Radhe Shyam: ఇదిగో పరమహంస

ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘రాధేశ్యామ్‌’ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 23న రామోజీ ఫిల్మ్‌సిటీలో ముందస్తు విడుదల వేడుకని నిర్వహించబోతున్నారు. ఇందులో సీనియర్‌...

Updated : 21 Dec 2021 10:52 IST

ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘రాధేశ్యామ్‌’ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 23న రామోజీ ఫిల్మ్‌సిటీలో ముందస్తు విడుదల వేడుకని నిర్వహించబోతున్నారు. ఇందులో సీనియర్‌ నటులు కృష్ణంరాజు పోషించిన పరమహంస పాత్రకి సంబంధించిన లుక్‌ని సోమవారం విడుదల చేశారు. ‘‘చాలా కాలం తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రావడం బాగుంది. ప్రభాస్‌తో కలిసి పరమహంసగా నటించడం మరింత ప్రత్యేకం’’ అంటూ ట్వీట్‌ చేశారు కృష్ణంరాజు. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.  గోపీకృష్ణ మూవీస్‌, యువీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని