Radhe Shyam: ‘రాధేశ్యామ్‌’ మెలొడీ ఫుల్‌ వీడియో.. ఆకట్టుకునేలా ప్రభాస్‌- పూజా కెమిస్ట్రీ..!

ప్రభాస్‌, పూజాహెగ్డే జంటగా నటించిన చిత్రం ‘రాధేశ్యామ్‌’. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాలోని ‘నగుమోము తారలే’ సాంగ్‌ ఫుల్‌ వీడియో విడుదలైంది.

Published : 24 Mar 2022 01:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌, పూజాహెగ్డే జంటగా నటించిన చిత్రం ‘రాధేశ్యామ్‌’. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాలోని ‘నగుమోము తారలే’ సాంగ్‌ ఫుల్‌ వీడియో విడుదలైంది. ప్రభాస్‌- పూజా కెమిస్ట్రీ, లొకేషన్లు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. కృష్ణకాంత్‌ రచించిన ఈ మెలొడీని సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించారు. జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందించారు. 70ల నాటి ఇటలీ నేపథ్యంలో.. లవ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్‌ హస్తసాముద్రికా నిపుణుడిగా నటించారు. ఆయన ప్రేయసి ప్రేరణగా పూజా హెగ్డే అలరించింది. యువీ క్రియేషన్స్‌, గోపీ కృష్ణ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్‌ ఖేడ్‌కర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని