Radhe Shyam: ‘రాధేశ్యామ్‌’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ప్రభాస్‌, పూజాహెగ్డే హీరో-హీరోయిన్లు రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’.

Updated : 28 Mar 2022 15:49 IST

హైదరాబాద్‌: ప్రభాస్‌, పూజాహెగ్డే హీరో-హీరోయిన్లు రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందనలు అందుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అమెజాన్‌ సరికొత్త ట్రైలర్‌ను విడుదల చేసింది. ‘రాధేశ్యామ్‌’లో  ప్రభాస్‌ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హస్తసాముద్రికా నిపుణుడి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తెరపై ప్రభాస్‌-పూజా హెగ్డేల కెమెస్ట్రీ, పాటలు, విజువల్‌ ఎఫెక్ట్స్‌ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.

క‌థేంటంటే: విక్ర‌మాదిత్య (ప్ర‌భాస్‌)(Prabhas) పేరు మోసిన జ్యోతిషుడు. ఇట‌లీలో నివ‌సిస్తుంటాడు. హ‌స్త సాముద్రికంలో ఆయ‌న అంచ‌నాలు వంద‌శాతం నిజ‌మ‌వుతుంటాయి.త‌న చేతిలో ప్రేమ రేఖ లేద‌ని తెలుసుకున్న ఆయ‌న త‌న జీవితం గురించి కూడా ఓ స్ప‌ష్ట‌మైన అంచ‌నాతో ఉంటాడు. అనుకోకుండా ప్రేర‌ణ (పూజాహెగ్డే)(Pooja Hegde)ని క‌లుస్తాడు విక్ర‌మాదిత్య‌. తొలి చూపులోనే ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. కానీ, ప్రేమించ‌లేని ప‌రిస్థితి. మ‌రి విధి ఆ ఇద్ద‌రినీ ఎలా క‌లిపింది? వాళ్ల జీవితాల్లో జ‌రిగిన సంఘ‌ర్ష‌ణ ఎలాంటిదనేది మిగ‌తా క‌థ‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని