ప్రభాస్‌ మనసు తెలిసేది ఆరోజే..!

ప్రభాస్‌ మనసుని.. ప్రేమ అనే పదానికి సరైన అర్థాన్ని.. ప్రేమికులరోజున పరిచయం చేస్తాం అని అంటున్నారు ‘రాధేశ్యామ్‌’ టీమ్‌. ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న వింటేజ్‌ ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్‌...

Published : 06 Feb 2021 07:42 IST

‘రాధేశ్యామ్‌’ నుంచి స్పెషల్‌ సర్‌ప్రైజ్‌

హైదరాబాద్‌: ప్రభాస్‌ మనసుని.. ప్రేమ అనే పదానికి సరైన అర్థాన్ని.. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పరిచయం చేస్తాం అని అంటున్నారు ‘రాధేశ్యామ్‌’ టీమ్‌. ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న వింటేజ్‌ ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘రాధేశ్యామ్‌’ ప్రీ టీజర్‌ను చిత్రబృందం తాజాగా అభిమానులతో పంచుకుంది. ‘ఓ పోరాటయోధుడిగా‌, యాక్షన్‌ లవర్‌గా మీకు ప్రభాస్‌ తెలుసు. ఇప్పుడు ఆయన హృదయాన్ని తెలుసుకునే సమయం వచ్చింది. ప్రేమికుల దినోత్సవం రోజున మీరు నిజమైన ప్రేమను చూస్తారు’ అని పేర్కొంటూ 30 సెకన్ల వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో ప్రభాస్‌ ఓ ప్రేమికుడిగా యంగ్‌ లుక్‌లో కనిపించి ఫిదా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది. సోషల్‌మీడియా ట్రెండింగ్‌లో సైతం ఈ వీడియో దూసుకెళ్తోంది.

యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా పూజాహెగ్డే సందడి చేయనున్నారు. ఇందులో ఆమె ప్రేరణ అనే పాత్రలో కనిపించనున్నారు. అలనాటి బాలీవుడ్‌ నటి భాగ్యశ్రీ, ప్రియదర్శి, మురళీశర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఇదీ చదవండి

ఈ మెగా డేట్స్‌.. గుర్తుపెట్టుకోండి!Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు