Radhika Apte: ఆ కారణంతో ఎన్నో అవకాశాలు చేజారాయి: రాధికా ఆప్టే

ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతిఒక్కరూ యువ నటీమణులనే తమ సినిమాల్లో భాగం చేసుకోవాలని చూస్తున్నారని నటి రాధికా ఆప్టే అన్నారు.

Published : 12 Nov 2022 11:29 IST

ముంబయి: ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కరూ యువ నటీమణులనే తమ సినిమాల్లో భాగం చేసుకోవాలని చూస్తున్నారని నటి రాధికా ఆప్టే అన్నారు. దానివల్ల తాను కొన్నిసార్లు ఆఫర్స్‌ చేజార్చుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ‘‘నటీమణులకు ఆఫర్స్‌ రావడంలో వయసు కూడా ఒక ప్రభావాన్ని చూపిస్తోంది. అందుకే బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ చిత్రాల్లో యువ నటీమణులకే ఎక్కువగా అవకాశాలు వస్తుంటాయి. తమ స్క్రిప్ట్‌కు తగిన విధంగా ఉండే యువ తారలను ఎంచుకోవడానికి ఫిల్మ్‌ మేకర్స్‌ ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. ‘హీరోయిన్‌కు కావాల్సిన లక్షణాలు మీకు లేవు’ అనే కామెంట్స్‌ను ఈ పరిశ్రమలో ఎంతోమంది ఎదుర్కొంటున్నారు. ఆఫర్స్‌ కోసం సర్జరీలు చేయించుకోవడం చూస్తున్నాం. టాలెంట్‌ని కాకుండా లుక్స్‌ని బట్టి అవకాశాలివ్వడం కేవలం భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ ఉంది. దానికి వ్యతిరేకంగా మహిళలు గళం విప్పుతున్నారు’’ అని రాధికా ఆప్టే అన్నారు.

‘లెజెండ్‌’, ‘రక్తచరిత్ర’ తెలుగువారికి చేరువైన రాధికా ఆప్టే.. ‘లయన్‌’ తర్వాత టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లోనే వరుస సినిమాలు చేస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘మౌనికా ఓ మై డార్లింగ్‌’ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఆమె పోలీస్‌ పాత్రలో కనిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని