ఏంట్రా మన ఖర్మ..అంటున్న విజయ్‌సేతుపతి!

విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ పెంచుకుంటున్నారు నటుడు విజయ్‌సేతుపతి. మలయాళంలో జయరాం, సేతుపతి ప్రధానపాత్రలలో ‘రేడియో మాధవ్‌’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆ చిత్రాన్ని

Published : 13 Feb 2021 14:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ పెంచుకుంటున్నారు నటుడు విజయ్‌సేతుపతి. మలయాళంలో జయరాం, సేతుపతి ప్రధానపాత్రలలో ‘రేడియో మాధవ్‌’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆ చిత్రాన్ని తెలుగులో కూడా డబ్‌ చేస్తున్నారు. తాజాగా ఆ సినిమాలోని ‘ఏంట్రా మన ఖర్మా..’అంటూ సాగుతున్న సాంగ్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ పాటలో మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ తనదైన స్టైల్లో చిందులు వేస్తూ అలరించారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మరికొన్ని రోజుల్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సనీల్‌ కలాథిల్ తెరకెక్కించిన ఈ చిత్రానికి జయచంద్రన్‌ స్వరాలు సమకూర్చారు. తెలుగులో లక్ష్మీ చెన్నకేశవ ఫిల్మ్స్‌ పతాకంపై థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలోని మరో నటుడు జయరామ్‌ తెలుగులో ‘భాగమతి’ ‘అలవైకుంఠపురం’ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. మరోవైపు విజయ్‌సేతుపతి ఇటీవలే విడుదలైన ‘ఉప్పెన’ చిత్రంలో తనదైన విలనిజంతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి!

కోల్‌కతాలో మొదలైంది

సల్మాన్‌కు విలన్‌గా ఇమ్రాన్‌హష్మీ?

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని