Raghava Lawrence: లారెన్స్‌ వదులుకున్నారు... విజయ్‌సేతుపతి అందుకున్నారు!

రాఘవ లారెన్స్‌ నటించాల్సిన ఓ పాత్రను విజయ్‌ సేతుపతి పోషించి, ప్రేక్షకులను విశేషంగా అలరించారు. తన ఖాతాలో మరో విజయాన్ని అందుకున్నారు. అది ఏ పాత్ర? ఏ సినిమా అంటే?

Published : 17 Apr 2023 00:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకరు నటించాల్సిన పాత్రను మరొకరు పోషించడమనేది చిత్ర పరిశ్రమలో సాధారణం. ఒక్కొక్కరు ఒక్కో కారణం వల్ల తమ దగ్గరకు వచ్చిన అవకాశాలను తిరస్కరిస్తారు. వేరొకరు ఆ ఛాన్స్‌ సద్వినియోగం చేసుకుంటారు. ఆ జాబితాలోకే వస్తారు రాఘవ లారెన్స్‌ (Raghava Lawrence), విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi). అది ఏ పాత్రంటే? ‘విక్రమ్‌’ (Vikram) చిత్రంలోని సంతానం. కమల్‌హాసన్‌ ( Kamal Haasan) హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) తెరకెక్కించిన ఆ సినిమా గతేడాది విడుదలై, ఘన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఏజెంట్‌ అరుణ్‌కుమార్‌ విక్రమ్‌గా కమల్‌, ఏజెంట్‌ అమర్‌గా ఫహద్‌ ఫాజిల్‌, సంతానం క్యారెక్టర్‌లో విజయ్‌ సేతుపతి ఒదిగిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. విభిన్నమైన మ్యానరిజంతో సేతుపతి సర్‌ప్రైజ్‌ చేశారు. నెగెటివ్‌ ఛాయలున్న ఆ క్యారెక్టర్‌కు సేతుపతి తప్ప మరొకరు న్యాయం చేయలేరేమో అని అనిపించేంతగా యాక్ట్‌ చేశారు. ఇదే రోల్‌ లారెన్స్‌ ప్లే చేసుంటే ఎలా ఉండేదో ఊహించుకోండి. ఎందుకంటే..?

సంతానం పాత్ర కోసం దర్శకుడు లోకేశ్‌ ముందుగా లారెన్స్‌నే సంప్రదించారు. అదే సమయంలో.. ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడం, డేట్స్‌ సర్దుబాటుకాకపోవడంతో లారెన్స్‌ నటించడం కుదరదని చెప్పారు. దాంతో, లోకేశ్‌.. విజయ్‌ సేతుపతిని తీసుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఈ విశేషాలు పంచుకున్న లారెన్స్‌.. ‘‘నేనూ లోకేశ్‌ ఎప్పటి నుంచో కలిసి పనిచేయాలనుకుంటున్నాం. భవిష్యత్తులో అది జరగొచ్చు. ప్రస్తుతానికి లోకేశ్‌ రాసిన ఓ కథలో నేను నటించబోతున్నా. దానికి అతడి అసిస్టెంట్‌ దర్శకత్వం వహించనున్నాడు. హీరోయిన్‌గా నయనతారను అనుకుంటున్నాం’’ అని తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని