Oscars: ‘ఆస్కార్‌’ వేదికపై ‘నాటు నాటు’ లైవ్‌

చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఆస్కార్‌’ వేడుకకు సర్వం సిద్ధమవుతోంది. మార్చి 12న లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ వేడుక జరగనుంది.

Updated : 01 Mar 2023 15:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)కు మరో విశేష గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక ‘ఆస్కార్‌’ (Oscars) వేదికపై ‘నాటు నాటు’ (Naatu Naatu) పాడే అవకాశం దొరికింది. ఈ విషయాన్ని అకాడమీ బృందం అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు మార్చి 12న లాస్‌ఏంజెల్స్‌లో జరగనున్న ఆస్కార్‌ వేడుకల్లో గాయకులు కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ ‘నాటు నాటు’ ప్రదర్శన ఇవ్వనున్నారు. హాలీవుడ్‌ చిత్రాలతోపాటు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు సైతం ఈ అవకాశం దక్కడం పట్ల సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ‘నాటు నాటు’ (NAATU NAATU) నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. దీంతో 95వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం కోసం భారతీయ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ నుంచి ‘దిస్‌ ఈజ్‌ ఏ లైఫ్‌’, ‘టెల్‌ ఇట్‌ లైక్‌ ఏ ఉమెన్‌‌’ నుంచి ‘అప్లాజ్‌’, ‘బ్లాక్‌ పాంథర్ వకాండ ఫరేవర్‌’ నుంచి ‘లిఫ్ట్‌ మి అప్‌’ వంటి పాటలతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు’ పోటీ పడుతోంది. మరోవైపు.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ‘గోల్డెన్‌ గ్లోబ్‌’, ‘హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌’, ‘క్రిటిక్స్‌ ఛాయిస్‌’ వంటి అవార్డులను ఈ పాట దక్కించుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని