Takkar: ఇంద్రధనుస్సులో కొత్త రంగులా

సిద్ధార్థ్‌, దివ్యాంశ కౌశిక్‌ జంటగా నటించిన చిత్రం ‘టక్కర్‌’. జూన్‌ 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

Updated : 03 Jun 2023 12:38 IST

సిద్ధార్థ్‌ (Siddharth), దివ్యాంశ కౌశిక్‌ జంటగా నటించిన చిత్రం ‘టక్కర్‌’ (Takkar). జూన్‌ 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. కార్తీక్‌ జి క్రిష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. శుక్రవారం ఈ చిత్రంలోని ‘రెయిన్‌ బో చివరే ఒక వర్ణం చేరేలే’ పాటను విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రానికి నివాస్‌.కె ప్రసన్న సంగీతం అందించగా, కృష్ణకాంత్‌ సాహిత్యాన్నందించారు. నాయకానాయికలిద్దరూ కారులో వెళ్తూ, దారిలో కలిసిన వారితో సరదాగా గడుపుతున్నట్లుగా పాట
చిత్రీకరణ సాగింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని