Raj Kundra: ఆమెకు నా చెల్లి భర్తతో అఫైర్‌ ఉంది

మొదటి భార్య కవిత నుంచి తాను విడాకులు తీసుకోవడానికి శిల్పాశెట్టి కారణం కాదని ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా తెలిపారు. సుమారు 12 సంవత్సరాల తర్వాత కవితతో విడిపోవడానికి గల కారణాన్ని ...

Updated : 12 Jun 2021 13:52 IST

కవితతో విడిపోవడానికి శిల్ప కారణం కాదు

విడాకుల వ్యవహారంపై రాజ్‌కుంద్రా వ్యాఖ్యలు

ముంబయి: మొదటి భార్య కవిత నుంచి తాను విడాకులు తీసుకోవడానికి శిల్పాశెట్టి కారణం కాదని ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా తెలిపారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత కవితతో విడిపోవడానికి గల కారణాన్ని ఆయన బయటపెట్టారు. తాజాగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యవహారంపై స్పందించారు. కవితకు.. తన చెల్లెలి భర్తతో వివాహేతర సంబంధం ఉందంటూ కుంద్రా ఆరోపణలు చేశారు. దీంతో రాజ్‌కుంద్రా విడాకుల వ్యవహారం ప్రస్తుతం బీటౌన్‌లో చర్చనీయాంశమైంది.

‘నా మొదటి భార్య కవితతో విడిపోవడానికి శిల్పాశెట్టి అస్సలు కారణం కానేకాదు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మేమిద్దరం విడిపోయాం. కొన్నేళ్ల క్రితం మేము లండన్‌లో నివాసం ఉన్నాం. నా తల్లిదండ్రులతోపాటు చెల్లి, ఆమె భర్త కూడా మాతోనే ఉండేవారు. దాంతో.. కవితకు నా చెల్లెలి భర్తతో రిలేషన్‌షిప్‌ పెరిగింది. బిజినెస్‌ పనులపై నేను ఎప్పుడైనా టూర్‌కి వెళ్తే.. కవిత ప్రవర్తన మారేది. నా చెల్లెలి భర్తతో కవితకు సంబంధం ఉందని ఇంట్లో వాళ్లందరూ చెప్పారు. ఆఖరికి మా కారు డ్రైవర్‌ కూడా వాళ్ల గురించి అసభ్యంగా చెప్పాడు. దాంతో మా చెల్లి, ఆమె భర్తను భారత్‌కు పంపించేశాం. అయినా సరే కవిత అతడితో మాట్లాడడం మానలేదు. రహస్యంగా ఒక సెల్‌ఫోన్‌ని కొనుగోలు చేసి దాని నుంచి అతనికి తరచూ మెస్సేజ్‌లు చేసేది. ఆ ఫోన్‌ ఒకసారి నా కంట పడింది. అందులో ఉన్న మెస్సేజ్‌లు చూసి నా హృదయం ముక్కలైంది. దాంతో నేను కవిత నుంచి విడాకులు తీసుకున్నాను. అనంతరం నా జీవితంలోకి శిల్పాశెట్టి ప్రవేశించింది. నా గురించి శిల్పకు అన్ని తెలుసు. అలా, ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుని.. ఇప్పుడు సంతోషంగా ఉన్నాను’ అని రాజ్‌కుంద్రా వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని