రవితేజ ‘రాజా ది గ్రేట్‌’కి సీక్వెల్‌ రానుందా?

మాస్‌ మాహరాజ రవితేజ కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నటించిన చిత్రం ‘రాజా ది గ్రేట్‌’. 2017లో యాక్షన్‌ కామెడీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘రాజా 2 ది గ్రేట్‌’ టైటిల్‌తో రానుందని అనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

Published : 01 May 2021 13:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్: మాస్‌ మహారాజ రవితేజ కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నటించిన చిత్రం ‘రాజా ది గ్రేట్‌’. 2017లో యాక్షన్‌ కామెడీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘రాజా 2 ది గ్రేట్‌’ టైటిల్‌తో రానుందని అనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి ఓ సందర్భంలో ఈ చిత్రం సీక్వెల్‌ గురించి చెబుతూ..‘‘రాజా ది గ్రేట్‌’ సినిమాకి సీక్వెల్‌  కచ్చితంగా ఉంటుంది. అయితే అది ఎప్పుడు అనేది ఇప్పుడు చెప్పలేనని’’ తెలిపారు. దర్శకుడు అనిల్‌ ఇటీవల హీరో రవితేజకి చిత్రానికి సంబంధించి స్టోరీలైన్‌ వినిపించాడట. అయితే రవితేజ మాత్రం పూర్తి స్క్రిప్ట్‌తో రావాలని దర్శకుడి కోరాడట.

అన్ని సవ్యంగా కుదిరితే ఈ ఏడాది చివరిలో కానీ, లేదా వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ‘రాజా ది గ్రేట్‌’ చిత్రంలో లక్కీగా మెహరీన్‌ నటించగా, ప్రకాష్‌రాజ్‌ పోలీస్‌ అధికారిగా, రాధిక - రవితేజ తల్లి పాత్రలో నటించింది. హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి, సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌, తనికెళ్ల భరణి తదితరులు ఇతర పాత్రల్లో నటించి అలరించారు. ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడి’ చిత్రం చేస్తుండగా అనిల్ రావిపూడి ‘ఎఫ్‌ 3’ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని